ప్రాయానికి అందానికి అవినాభావ సంబంధం ఉంది. దీపం ఉండగానే వెలుగు చూడాలి. పరువాలకు కూడా పట్టు విడుపుల ఒడుపులు తెలిసి ఉండాలి. సొగసుకు తెలివి కూడా తోడు అయితేనే పరువం రాణిస్తుంది. పందెం గెలుస్తుంది. ఆ హద్దుల పద్దులు మొత్తం తెలిసిన చిన్నది కాబట్టే నభా నటేష్ శభాష్ అనిపించేస్తోంది.


నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు సరైన చాన్సులు  ఇప్పటివరకూ తగల్లేదు. అయితే లేటెస్ట్ గా సెన్సేషనల్  డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కొత్త మూవీ ఇస్మార్ట్ శంకర్ మూవీలో హాట్ హాట్ అందాల్  హీరోయిన్ గా అమెకు లక్కీ  ఆఫర్ దక్కింది. దాంతో ఈ మూవీతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోవాలనుకుంటోందట. ఈమూవీ జయాపజయాలు ఎలా ఉన్నా తన అందాల ఆరబోతతో మొత్తం ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోవాలని డిసైడ్ అయినట్లుంది ఈ ముద్దు గుమ్మ


అందుకే ఓ వైపు షూటింగ్ జరుగుతూంటే మరో వైపు కెమెరా కళ్ళకు తన సోయగాలను  అప్పగించి  హీటెక్కించే ఫోజులను వదులుతోంది. తనకు  పట్టు విడుపులు బాగా తెలుసంటూ హింట్ ఇస్తోంది. మరి ఈ అమ్మడు ఆరాటం టాలీవుడ్ అర్ధం చేసుకుంటే ఇక ఆఫర్లు వెల్లువెత్తడం ష్యూర్ అంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ల కొరత తో ఉన్న టాలీవుడ్ కి నభా నటేష్ అనుకోని వరమవుతుందేమో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: