యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చి హిట్ అందుకున్న సినిమా టెంపర్. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాను పూరి చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు. ఆ సినిమా విజయం పూరికి లక్ కలిసి వస్తుందని అనుకున్నారు కాని టెంపర్ నుండి ఎన్.టి.ఆర్ తన సినిమాల పంథా మార్చి సూపర్ హిట్లు కొడుతున్నాడు.


ఇక తెలుగులో హిట్టైన సినిమాలకు బయట భాషల్లో డిమాండ్ ఎక్కువ. తెలుగులో హిట్టైన చాలా సినిమాలు తమిళ, హింది భాషల్లో రీమేక్ చేశారు. లేటెస్ట్ గా తారక్ నటించిన టెంపర్ సినిమా హిందిలో సింబాగా తెరకెక్కించగా.. ఆ సినిమా అక్కడ హిట్ అయ్యింది. అయితే స్టోరీ టెంపర్ దే అయినా అక్కడ స్క్రీన్ ప్లే పూర్తిగా మార్చేశారు.


ఇక ఇప్పుడు తమిళ టెంపర్ టైం వచ్చింది. విశాల్ హీరోగా వెంకట్ మోహన్ డైరక్షన్ లో అయోగ్య పేరుతో టెంపర్ సినిమా వస్తుంది. ఈ సినిమా టీజర్ కొద్దిగంటల క్రితం రిలీజైంది. ఈమధ్య వరుస హిట్లతో తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫాం లో ఉన్న విశాల్ కేవలం తమిళంలోనే అయోగ్య సినిమా చేస్తున్నాడు.


ఈ సినిమా టీజర్ చూస్తే తారక్ టెంపర్ యాజిటీజ్ దించేశారని అనిపిస్తుంది. అదే బ్యాక్ డ్రాప్.. అదే సీన్స్ కాపీ చేసినట్టు ఉంది. మరి ఇందులో దర్శకుడి ప్రతిభ ఎక్కడుందో తెలియాల్సి ఉంది. విశాల్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న అయోగ్య సినిమాకు సాం సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: