వైఎస్సార్ బయోపిక్ గా వైఎస్ చేసిన పాదయాత్ర నేపథ్యంతో వచ్చిన సినిమా యాత్ర. మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 8 శుక్రవారం రిలీజైన ఈ సినిమా అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాతో మరోసారి ప్రజల హృదయాల్లో వైఎస్సార్ బ్రతికే ఉన్నాడని నిరూపించారు.


యాత్ర సినిమా ముఖ్యంగా వైఎస్ పాదయాత్ర టైంలో ఆయన ఎదుర్కున్న స్వీయానుభావాలు వాటి వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజలకు లబ్ధి చేకూరేలా ప్రవేశ పెట్టిన పథకాల గురించి బాగా చూపించారు. మహి వి రాఘవ్ సినిమాలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ యాస్పెక్ట్ లేకున్నా సినిమాను చాలా చక్కగా తీసుకెళ్లారు.


సినిమా మొత్తం ఎమోషనల్ జర్నీగా అనిపిస్తుంది. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లో అంటే ఆదివారం కల్లా సగానికి పైగా వసూళు చేసిందని అంటున్నారు. యాత్ర సినిమా డిజిటల్ రైట్స్ లో కూడా దుమ్ముదులిపేసిందని తెలుస్తుంది. అమేజాన్ వారు యాత్రకు వచ్చిన హిట్ టాక్ వల్ల ఆ సినిమాను 8 కోట్లకు కొనేశారట.


దాదాపు ఇది ఓ స్టార్ హీరో సినిమాకు వచ్చే ప్రైజ్.. వైఎస్సార్ గా మమ్ముట్టి నటన అందరిని కట్టి పడేసింది. మరోసారి వైఎస్సార్ ను తెర మీద చూస్తున్న అనుభూతి కలిగించాడు దర్శకుడు మహి వి రాఘవ్. డిజిటల్ రైట్స్ ఈ రేంజ్ లో ఉంటే శాటిలైట్ రైట్స్ కూడా ఇదే రేంజ్ లో పలికే అవకాశం ఉంది. మొత్తానికి వైఎస్సార్ బయోపిక్ తో నిర్మాతలు విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి మంచి లాభాలు పొందేలా ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: