టాలీవుడ్ లో బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఓ ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి వరకు రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అంటూ చెప్పుకున్న బాలీవుడ్, కోలీవుడ్ లో సైతం బాహుబలి 2 తిరుగులేని రికార్డులు సృష్టించింది.  భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బెంచ్ మార్క్ వల్ల దాన్ని స్థాయిలోనో లేదా మించిపోయేలా తమ భాషలోనూ ఉండాలని ఇతర చిత్ర పరిశ్రమలు తెగ ఆరాట పడుతున్నాయి.  ఈ నేపథ్యంలోన అప్పట్లో విజయ్ నటించిన పులి, గత యేడాది అమీర్ ఖాన్ నటించిన  ఖాన్ తగ్స్ అఫ్ హిందుస్థాన్ వచ్చాయి..కానీ బాహుబలి రికార్డు స్థాయికి అందుకోలేక పోయాయి. 
Image result for విక్రమ్ మహావీర్ కర్ణ
ప్రస్తుతం సౌత్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా 'మహావీర్ కర్ణ' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రూ.300 కోట్లతో ఎపిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కు తోంది. మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మలయాళ దర్శకుడు ఆర్.ఎస్.విమల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది.  దర్శకుడు రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కు పోటీగా రూ.300 కోట్ల బడ్జెట్ తో ఇది రూపొందుతోందని ఇప్పటికే తమిళ మీడియా ఓ రేంజ్ లో మోసేస్తోంది.
Image result for విక్రమ్ మహావీర్ కర్ణ
అమెరికాలోని న్యూయార్క్ బేస్డ్ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ 'యూనైటెడ్ ఫిల్మ్ కింగ్‌డమ్' దీన్ని నిర్మిస్తోంది.  ఈ మూవీ కోసం వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో  కురుక్షేత్ర సంగ్రామానికి సంబందించిన సీన్లు చిత్రీకరిస్తున్నారు. మొత్తం 18 రోజుల పాటు భీకరమైన ఈ యుద్ధ సన్నివేశాలని తీయబోతున్నారు. విక్రమ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త రూపంలో ఇందులో చూడబోతున్నారని యూనిట్ తెగ ఊరిస్తోంది. 
Image result for విక్రమ్ మహావీర్ కర్ణ
మహావీర్ కర్ణ' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 37 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా వ్యాపార దృక్ఫథంతో తీయడం లేదని, 37 భాషల్లో సినిమాను విడుదల చేయడానికి కారణం కర్ణుడి చరిత్ర ప్రపంచం మొత్తం తెలియాలనే ఉద్దేశ్యంతోనే అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: