కత్రికా కైఫ్. అందలా నైఫ్. కత్తి లాంటి చూపులతో గుండెల్లో కోత పెడుతుంది. వగల సెగలతో వేసవి వేడిని పుట్టిస్తుంది. కుర్ర గుండెల్లో మంట రేపడమంటే కత్రినాకు భలే సరదా. పొడగరి, సొగసరి అయిన ఈ ముద్దు గుమ్మ తెలుగు వారి మల్లీశ్వరి. బాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా ఉన్న కత్రినా గురించి ఎన్నో గాసిప్పులు ఉన్నాయి. మరెన్నో రకాలుగా న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది.


వాటిని ఎపుడూ పట్టించుకోని ఈ అమ్మడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఓ రేంజిలో గుస్సా అయింది. రణబీర్ కపూర్ తో అఫైర్స్ మీద రాసినా వూరుకున్న కత్రినా ఎందుకో  మరి అలా చిర్రుబుర్రులాడింది. బాలీవుడ్లో జంటలకు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి మీ సంగతేంటి అని మీడియా అడిగిన దానికి కత్రినా మండిపడడమే కాదు, షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.


ఏం నేనూ మనిషిని కానా... నాకూ కు కోరికలూ అవసరాలు ఉంటాయి. నేను మాత్రం పెళ్ళి చేసుకోకూడదా అంటూ దారుణంగా విరుచుకుపడింది. తన గురించి ఏమేమో రాస్తున్నారంటూ మీడియా మీద బాగానే ఫైర్ అయింది. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం మంచిదే. నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. నేను కూడా ప్రతీ ఒక్కరి మాదిరిగా మనిషినే. నాకు మాత్రం పెళ్లి చేసుకోవాలని ఉండదా? నన్నెందుకు వేరుగా చూస్తారు.


 అలా నన్ను చూడకూడదు అంటూ కత్రినా కైఫ్ ఘాటుగా కామెంట్స్ చేసింది. మొత్తానికి మూడు పదులు దాటిన ఈ ముద్దు గుమ్మకు పెళ్ళి ఆలోచనలు ఇపుడు ఎక్కువగానే  ఉన్నట్లున్నాయి. అయితే గాసిప్పుల మీద గయ్యుమంటున్న కత్రినా సరైన జోడీ కుదిరితే మూడు ముళ్ళూ వేయించుకోవడం ష్యూర్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: