తెలుగు సినిమాల్లో ఆఫర్లు ఉంటే ఆ కిక్కే వేరు. ఒక్కసారి అవి తగ్గాక ఎవరికైనా పిచ్చెక్కిపోతుంది. చుట్టూ ఫ్యాన్స్ తో సందడి చేసిన వారికి బోర్ కొట్టేస్తుంది. మరి అటువంటి వారి కోసం ఉన్నవే పాలిటిక్స్. సినిమాల్లో రిటైర్ ఐతే  చాలు  హ్యాపీగా రాజకీయాల్లో జాయిన్ అయిపోవచ్చు. అలా చాలా మంది ఫేడౌట్ ఆరిస్టులు, టాప్ ఆర్టిస్టులు కూడా ఇపుడు మైన్ స్ట్రీం పాలిటిక్స్ లో బిజీ అవుతున్నారు.


ఇక టీడీపీ పుట్టుకే సినిమా నుండి.  అన్న నందమూరి ఆ పార్టీని పెట్టాక చాలా మంది సినీ జీవులకు పొలిటికల్ ఎంట్రీ సులువైంది. ఇక చంద్రబాబు జమానాలో అది మరింతగా పెరిగి అక్కడ పెద్ద క్యూ కనిపించేది. సినిమా నటులంతా బాబు పక్కనే కనిపించేవారు. ఉమ్మడి ఏపీకి బాబు సీఎంగా ఉన్న రోజుల్లో టాలీవుడ్ ఫుల్ సపోర్ట్ గా ఉండేది. విభజన తరువాత మేజర్ పార్ట్ కేసీయర్ కి జై కొడుతున్నా అవసరార్ధం బాబు వైపూ చూస్తున్నారు.


వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీకి సినీ గ్లామర్ అవసరమవుతోంది. దాంతో చాలా మందికి పిలుపులు వెళ్ళాయి. వచ్చిన వారు వస్తున్నారు కూడా అయితే కొంత మంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. ఆ లిస్ట్ లో ఒకనాటి వాన సుందరి వాణీ విశ్వనాధ్ ని చెప్పుకోవాలి. ఆ మధ్య వాణి వచ్చి ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాకే సవాల్ చేసింది. తనది కూడా చిత్తూరు అని రోజా మీద పోటీ చేస్తానని కూడా స్టేట్మెంట్లు ఇచ్చింది. అప్పట్లో వాణిని బాగానే టీడీపీ ఎంకరేజ్ చేసింది. మరి ఏమైందో ఏమో కానీ వాణి విశ్వనాధ్ హటాత్తుగా పొలిటికల్ సీన్ మీద నుంచి గాయబ్ అయిపోయింది. 


నగరి సీటు నుంచి రోజాకు పోటీగా అప్పట్లో వాణిని తెచ్చారు. అయితే మధ్యలో సీనియర్ నేత గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు చనిపోవడంతో ఆ సీటును వారసులకు ఇస్తున్నారు. దీంతోనే వాణి సైడ్ అయిందని అంటున్నారు. ఇక వాణి వెళ్ళిపోయినా మరో వాణి ఇపుడు టీడీపీకి దొరికింది. ఆమె పెళ్ళి పుస్తకం ఫేమ్  దివ్య వాణి.ఆ మధ్యన బాబు సమక్షంలో టీడీపీలో చేరిన దివ్య వాణి ఇపుడు డిల్లీలో జరిగిన ధర్మ పోరాట దీక్ష‌లో తొలిసారి మెరిసి మైకు అందుకుంది. మరి దివ్య వాణి గ్లామర్ ఎంతవరకు టీడీపీకి యూజ్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: