టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గత సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.  ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో రూ.200 కోట్ల క్లబ్ లో చేరింది.  ప్రస్తుతం దర్శక, నిర్మాత అయిన వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది.  ఓ ఆగర్భ శ్రీమంతుడు అన్ని వదిలి తన స్నేహితుడి కోసం భారత దేశం వచ్చి ఓ చిన్న గ్రామంలో జీవితాన్ని గడుపుతాడు..ఆ సమయంలో గ్రామ ప్రజలను ఎలా చైతన్యపరుస్తాడు అన్న కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందట.
Related image
ఏప్రిల్ చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తన 26వ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయాలని మహేశ్ బాబు అనుకున్నాడు. కాకపోతే స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా సిద్ధం కావడానికి 6 నెలల సమయం పడుతుందని సుకుమార్ చెప్పడంతో మహేష్ బాబు మరో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  ఈ మద్య కాలంలో వరుసగా విజయాలు అందుకుంటున్న అనిల్ రావిపూడి తో తన తదుపరి సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Image result for mahesh babu anil ravipudi
మొదటి నుంచి అనిల్ రావిపూడిపై నమ్మకం ఉంచుతూ వస్తోన్న దిల్ రాజు, 'ఎఫ్ 2'తో భారీ లాభాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మహేశ్ - అనిల్ సినిమాను నిర్మించడానికి ఆయనే ముందుకు వచ్చాడనేది తాజా సమాచారం.  అయితే తన సినిమాల ద్వారా నష్టపోయిన అనిల్ సుంకరను ఆదుకోవడం కోసం, ఈ సినిమా నిర్మాణంలో ఆయనని మహేశ్ బాబు భాగస్వామిని చేసినట్టుగా తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: