కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో అజిత్ కుమార్.  ఈ హీరో నటిస్తున్న సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు థియేటర్ల ముందు నానా హంగామా చేస్తుంటారు.  ఆ మద్య రజినీకాంత్ నటించిన పెట్టా, అజిత్ నటించిన విశ్వాసం రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం..ఫ్యాన్స్ మద్య పెను వివాదం నెలకొంది.  కొంత మంది థియేటర్ల ముందు ఫైటింగ్ చేసుకోవడం కత్తులతో పొడుచుకోవడం కూడా జరిగింది.  అయితే ఈ విషయం తెలుసుకున్న అజిత్ తన అభిమానులకు ఇలాంటివి మరోసారి రిపీట్ కావొద్దని కాస్త గట్టిగానే చెప్పినట్లు సమాచారం. 
Related image
అజిత్ నటన చాలా నేచురల్ గా ఉంటుందని..నెరసిన జుత్తు, మీసకట్టుతోనే ఆయన నటిస్తుంటారని..అలాంటి సినిమాలు ఫ్యాన్స్ తెగ ఇష్టపడుతున్నారని తమిళ నాట టాక్.  ఈ సంవత్సరం రిలీజ్ అని ‘విశ్వాసం’తమిళ నాట సూపర్ హిట్ అయ్యింది.  జనవరి 10వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా తమిళంలో భారీ వసూళ్లను రాబట్టింది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను అదే సమయంలో తెలుగులోను విడుదల చేయాలనుకున్నారు. 
Related image
కాకపోతే ఆ సమయంలో వరుసగా ఎన్టీఆర్ కథానాయకుడు, వినయవిధేయ రామ, ఎఫ్ 2, పేటా మూవీలు రిలీజ్ కావడంతో ‘విశ్వాసం’వాయిదా వేశారు. తెలుగులో అజిత్ కి మంచి క్రేజ్ వుంది .. ఇక నయనతారకి తెలుగులో పెద్ద సంఖ్యలో అభిమానులు వున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రను చేసింది జగపతిబాబు కావడం తెలుగు వెర్షన్ కి కలిసొచ్చే ప్రధానమైన అంశం. అందుకే ఈ సినిమా  మార్చి1వ తేదీన విడుడల చేయడానికి రంగం సిద్దం చేసినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: