టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ మద్య బాలీవుడ్ హీరోలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు.  స్టార్ డైరెక్టర్ శంకర్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు.  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిదే.  శంకర్, కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 లో అజయ్ దేవగణ్ కీలక పోషించ‌నున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వ‌చ్చాయి.
Image result for indian 2 movie
దీనిపై అభిమానుల‌లో ప‌లు అనుమానాలు నెల‌కొన‌గా, తాజాగా అజ‌య్ దేవ‌గ‌ణ్ క్లారిటీ ఇచ్చాడు.  భారతీయుడు 2 సినిమాలో తాను నటిస్తున్నానని వస్తున్న వార్తలు నిజం కాదని..కాకపోతే శంకర్ గతంలో తనను ఈ సినిమాలో నటించమని కోరారు..కానీ ప్రస్తుతం తాను ‘తానాజీ’సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరకపోవడంతో ఆ సినిమాలో నటించలేనని చెప్పానని అన్నారు. 
Image result for rrr movie
ఇక రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా తాను న‌టిస్తున్నానంటూ వ‌స్తున్న వార్త‌ల‌లో ఏ మాత్రం నిజం లేదు. రాజ‌మౌళి ఇంత వ‌ర‌కు న‌న్ను సంప్ర‌దించ‌లేదని అన్నారు.  తానాజీ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలో తీస్తున్న కారణంతో ఏ సినిమాలకు ప్రస్తుతం డేట్స్ ఇవ్వడం కుదరడం లేదని అజయ్ దేవగణ్ అన్నారు. త్వ‌ర‌లో తానాజీ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్‌తో మీ ముందుకు వ‌స్తాను అని బ‌దులిచ్చాడు. శంక‌ర్ ఇండియ‌న్ 2 , రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలు ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: