జూనియర్ జూనియర్ ఎన్.టి.ఆర్ అంటేనే ఓ క్రేజ్. ఆయన సినిమా కెరీర్ పైనే ఇపుడు ద్రుష్టి పెట్టినా రాజకీయాన్ని కూడా అపుడపుడు కలగలిపి చూస్తూంటారు. ఆయన టీడీపీ మనిషేనని ఆ పార్టీ వారు అంటూంటారు. అయితే జూనియర్ మాత్రం 2009 తరువాత రాజ‌కీయల ఊసు లేకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. ఆయన తన సొంత అక్క తెలంగాణాలో పోటీ చేసినా కూడా అటు వైపు చూడలేదు. మరి ఆయనకు పిల్లనిచ్చిన మామ గారిని పాలిటిక్స్ పై ఆసక్తి ఉన్నట్లుగా ఉందంటున్నారు.


విషయానికి వస్తే వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ను ప్రముఖ నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్.మామ  ఈ రోజు కలిసినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది.  ఇది సహజంగానే చర్చనీయాంశం అయింది. ఎన్.టి.ఆర్.మామ అయిన నార్నె శ్రీనివాసరావు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా సమీప బందువే.ఆయన ఈ సమయంలో జగన్ ను కలవడం సహజంగానే రాజకీయంగా ప్రాదాన్యత ఏర్పడుతుంది. మీడియా శ్రీనివాసరావును దీని గురించి ప్రశ్నిస్తే మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారట. టిడిపి ఎమ్.పి పి రవీంద్రబాబు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన తరుణంలోనే నార్నె కూడా లోటస్ పాండ్ కు వెళ్లడం ఆసక్తికరంగా ఉంది.మరి ఇందులో ఏమైనా రాజకీయం ఉందా?లేదా అన్నది తెలియవలసి ఉంది.


ఏది ఏమైనా జూనియర్ మామ కనుక వైసీపీలో చేరితే ఆ రాజకీయాలు రంజుగా ఉంటాయానడంలో సందేహం లేదు. నిజానికి జూనియర్ కి అత్యంత సన్నిహితుడు, గుడివాడ ఎమ్మెల్యే నాని వైసీపీలోనే ఉన్నారు. దాంతో జూనియర్ కూడా ఆ పార్టీకి మద్దతుగా ఉంటారని గతంలోనే ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లేనని కూడా తేలిపోయింది. ఇక జూనియర్ విషయానికి వస్తే మూవీస్ చేసుకుంటున్నారు. తన పనేదో తాను అన్నట్లున్నారు. అయినా ఆయన్ని రాజకీయాలు మాత్రం వదలడంలేదు. ఇపుడు ఆయన మామ రూపంలో మరో రాజకీయ దుమారం రేగుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: