రాయ్ లక్ష్మి మొదటి పేరు లక్ష్మి రాయ్. ఆమె అలాగే తెరంగ్రేట్రం చేసింది. ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేసాక లక్ కలసి రావాలని రాయ్ లక్ష్మిగా మార్చేసుకుంది. ఆ తరువాత ఆమెకు ఐటం బాంబ్ గా మంచి పేరే వచ్చింది. ఆ మధ్యన మెగాస్టార్ పక్కన రత్తాలు రత్తాలు అంటూ రాయ్ లక్ష్మి చేసిన డ్యాన్స్ ఓ ఊపు ఊపేసింది. అందం, అభినయం, జోరుగా చేసే డ్యాన్సులు అన్నీ ఉన్నా స్టార్ ఇమేజ్ మాత్రం ఈ అమ్మడుకు రాలేదు.


దానికి కారణం తానేనని రాయ్ లక్ష్మి తాపీగా విచారిస్తోంది. లేటేస్ట్ గా ఓ మీడియా ఇంటర్వ్యూలో రాయ్ లక్ష్మి మాట్లాడుతూ తాను తెలుగులో మొదటిసారి చేసిన కాంచన మాల కేబుల్ టీవీ సినిమాను ఒప్పుకోవడమే పెద్ద తప్పు అని బాధపడుతోంది. అలా లోబడ్జెట్ మూవీ కాకుండా స్టార్ హీరో ఉన్న మూవీతోనే గ్రాండ్ ఎంట్రీ ఇస్తే తన దశ తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయేది అంటోంది. అయితే ఆ మూవీలో హీరో శ్రీకాంత్ కావడం, పైగా సినిమా కూడా ఫ్లాప్ కావడంతో రాయ్ లక్ష్మి కి  సీన్ రివర్స్ అయింది.


ఆ తరువాత ఆమెకు  స్టార్ హీరో బాలక్రిష్ణ మూవీ అధినాయకుడులో చాన్స్ దక్కింది. బాలయ్య పక్కన ఆడి పాడిన ఈ అమ్మడు గ్లామర్ కి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. దానికి కారణం వరసగా పలు మార్లు ఆ మూవీ వాయిదాలు పడుతూ వచ్చిందని, చివరికి ఓ రాంగ్ టైంలో రిలీజ్ కొట్టేసరికి మొత్తం సినిమా డిజాస్టర్ అయిందంటోంది. ఇలా  బ్యాడ్ లక్ తో ఫ్లాష్ బాక్ కలసి రాకపోయినా తనకు 2017లో మాత్రం మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ 150 లో మాత్రం స్పెషల్ సాంగ్ తో మళ్ళీ ఆఫర్ల వెల్లువ మొదలైందని చెబుతోంది.రత్తాలు సాంగ్ హిట్ కావడంతో తనకు ఐటం బాంబు గా  గుర్తింపు ఇచ్చారని  అంటోంది. మొత్తానికి రాయ్ లక్ష్మి టాలెంట్ ని ఇండస్ట్రీ వాడుకోలేదా. లేక ఆమె ఇండస్ట్రీని సరిగా అర్ధం చేసుకోలేదా అన్నది మాత్రం ఎప్పటికీ  ప్రశ్నే.


మరింత సమాచారం తెలుసుకోండి: