పవన్ కల్యాణ్ మళ్లీ సునామి సృష్టించాడు, అవార్డులంటే తనకో లెక్క కాదు అంటూ రుజువు చేసుకున్నాడు అంటున్నారు. స్థానికంగా ఇచ్చే నంది అవార్డుల మాట అలా ఉంచి సౌత్ ఇండియా స్థాయిలో అవార్డుల పంటను పండించుకుని తన సత్తా చాటుకున్నాడు అంటున్నారు.

యూఎఇలో ప్రకటించి సౌత్ ఇండియా ఫిలిం అవార్డుల్లో పవన్ గబ్బర్ సింగ్ సినిమా ఏకంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ఈసినిమా మొత్తం 13 విభాగాల్లో నామినేట్ కాగా అందులో దాదాపు సగం గెలుచుకొని అక్కడ కూడా గబ్బర్ సింగ్ అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్.

అత్యంత ప్రతిష్టాత్మకమైన భావించే ఉత్తమ నటుడు అవార్డు పవన్ కళ్యాణ్, ఉత్తమ నటిగా శృతిహాసన్ అవార్డులు గెలుచుకున్నారు. ఇక మిగిలిన విభాగాలలో ఉత్తమ డైరెక్టర్ గా హరీష్ శంకర్, ఉత్తమ సంగీత దర్శకునిగా దేవీశ్రీ ప్రసాద్, ఉత్తమ హాస్యనటుడిగా ప్రభాస్ శ్రీనులు అవార్డులు దక్కించుకొని గబ్బర్ సింగ్ తడాఖా చూపించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: