ఎవరెన్ని విమర్శలు చేసినా బాలక్రిష్ణ టాలీవుడ్ అగ్రనటుడు. అంతే కాదు. ఆయన ఘన చరిత్ర ఉన్న నందమూరి తారక రాముడి వారసుడు.  సినిమా చరిత్ర గురించి రాయాలంటే నందమూరి, అక్కినేని అని ప్రారంభించాలి. అటువంటి నటుడి సంతానంగా ఉంటూ ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్న బాలయ్య తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని రకాల పాత్రలు వేయాలంటే బాలయ్య తప్ప ఎవరూ లేరన్నది కూడా నిజమే.


అటువంటి బాలయ్యని ఏమీ కాకుండా మెగా బ్రదర్ నాగబాబు యూ ట్యూబ్ వేదికగా ఘాటు కామెంట్స్ ఎన్నో  చేశారు. ఎర్రోడి వీరగాధ అంటూ దారుణంగా తిట్టిపోశారు. ఎపుడో బాలయ్య అన్నారంటూ ఇపుడు తాపీగా తిట్ల పురాణం లంకించుకున్నారు. కానీ వేటికీ కూడా స్పందించకుండా బాలయ్య గొప్ప వివేకాన్ని చాటుకున్నారు. నిజానికి బాలయ్య చేసిన కామెంట్స్ లో చాలావరకు ఆయని విలెకరులు అడిగి అభిప్రాయం తీసుకున్నవే తప్ప ఆయనంతట ఆయన అన్నవేమీ కావు.


అది జరిగాక కూడా చిరంజీవి, బాలయ్య ఎన్నో సందర్భాలలో కలుసుకున్నారు. కబుర్లు చెప్పుకున్నారు. తన వందవ సినిమా గౌతమి పుత్ర  శాతకర్ణి ముహూర్తం  షాట్ కి బాలయ్య చిరంజీవిని ముఖ్య అతిధిగా  పిలిచిన సంగతీ విధితమే. ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్యని పూర్తిగా చీల్చి చెండాడుతూ నాబబాబు కామెంట్స్ పెడితే మెగాస్టార్ నాడు ఒక్క దాని మీద కూడా తన అభిప్రాయం చెప్పలేదు. అంతే కాకుండా పూర్తిగా మౌనంగా  ఉండిపోయారు.


ఇక సీన్ కట్ చేస్తే లేటెస్ట్ గా వైజాగ్ లో జరిగిన టీఎస్సార్ అవార్డుల ఫంక్షన్లో మాత్రం చిరు నవ్వులు చిందిస్తూ టాలీవుడ్లో మేమంతా ఒక్కటే. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. అంతా అన్నదమ్ములమే అంటూ మెగా స్పీచ్ అదరగొట్టేసారు చిరంజీవి. మరి అంతగా విభేదాలు లేనపుడు అన్నదమ్ముల్లా ఉన్నపుడు సొంత తమ్ముడు నాగబాబు సాటి నటుడు బాలయ్యను దారుణంగా కించపరుస్తూ వరసగా యూ ట్యూబ్లో పోస్టింగులు పెడుతూంటే బాధ్యత గల సీనియర్ హీరోగా చిరు ఏం చేశారంటూ ఇపుడు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి
 నిజంగా పెద్ద మనిషిగా బాలయ్య వాటిపైన ఎక్కడా రియాక్ట్ కాలేదు కానీ ఆయన కూడా తిట్ల పురాణం అందుకుంటే టాలీవుడ్  పరువు ఏమయ్యేదని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అన్న అలా తమ్ముడు ఇలా కానీ బాలయ్య మాత్రం ఎపుడూ ఒకేలా అంటున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: