నగుమోము నగ్మా అంటూ పాత పాట ఒకటి ఉంది. నగ్మా హీరోయిన్ గా టాప్ లెవెల్లో వెలిగిపోతున్న రోజుల్లో ఆమె పేరు చుట్టూనే పాటలు కూడా తిప్పుతూ రాసేవారు. తొంబై దశకంలో నగ్మా అంటే కుర్ర కారుకి కిర్రాకే. వెండి తెర మీద ఆరబోసిన అందాలతో శ్రుంగార దేవతలా ఆమె దర్శనమిస్తూంటే నాటి యువతకు నిద్ర లేని రాత్రులెన్నో. అయినా దయా దాక్షిణ్యం లేకుండా నగ్మా తన వంపు సొంపులతో రంపపు కోత కోసేసేది.  ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవాలా తెగించేయాలనిపించేలా చేసేది కూడా. 


అటువంటి నగ్మా టాలీవుడ్ కొ దూరమై దాదాపు రెండు దశాబ్దాల కాలం కావస్తోంది. తెలుగుల అగ్ర నటులు చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారితో ఆడి పాడిన నగ్మా ఏమైంది  చెప్మా అని అంతా అనుకుంటూ ఏళ్లకు ఏళ్లు గడిపేశారు. ఇపుడు నగ్మా మళ్ళీ టాలీవుడ్ ని కరుణించిచిందట.  ఈ మధ్య టీఎస్సార్ అవార్డుల కమిటీలో కనిపించిన నగ్మా తన  పాత ఫ్యాన్స్ కి ఓ తీయని న్యూస్ చెప్పింది. తాను తెలుగులో నటిస్తాను అంటూ.


ఆ వెంటనే మరో ఇంటెరెస్టింగ్ న్యూస్ కూడా వచ్చేసింది. నగ్మాను మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తన అప్ కమింగ్ మూవీలో ఓ కీలకమైన రోల్ లో తీసుకోబోతున్నారన్నది ఆ న్యూస్. బన్నీ, త్రివిక్రం కాంబోలో తెరకెక్కనున్న ఆ మూవీలో నగ్మాది చాలా ఇంపార్టంట్ రోల్ అంటున్నారు. తన డైరెక్షన్లోనే నదియాను అత్తారింటికి దారేది అంటూ కొత్త పాత్రలో చూపించి గ్లామర్ అద్దేసిన త్రివిక్రం ఇపుడు నగుమోము నంగాకు సైతం కొత్త నగిషీలు అద్ది టాలీవుడ్లో మరో మారు అబ్బా అనిపించేలా చేయబోతున్నారట. మరి ఆడి పాడిన నగ్మా ఇపుడు త్రివిక్రం మూవీలో పవర్ ఫుల్ రోల్ లో ఎలా కనిపిస్తుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: