సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల పాపులర్ బ్రాండ్ ఉత్పత్తులకు సంబంధించిన టాక్స్ ల విషయమై జీఎస్టీ ని ఎగ్గొట్టారని ఆయన బ్యాంక్ ఖాతాలను జీఎస్టీ అధికారుల స్తంభింప చేసిన విషయం తెలిసిందే. ఇక ఆయన హైదరాబాదులో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో అత్యంత భారీగా నిర్మించిన ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ కు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చినట్లు సమాచారం.
Related image
నిజానికి 2019 జనవరి 1 తరువాత ప్రభుత్వం నిర్ణయించిన మల్టీప్లెక్స్ టికెట్ ధరల ప్రకారం రూ.100 ఆ పైన ధరగలిగిన టికెట్ పై జిఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి, అలానే రూ. 100 లోపు ధరగలిగిన టిక్కెట్లపై జిఎస్టీని 18 నుండి 12 శాతనికి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియమాలను ఏ మాత్రం పట్టించుకోకుండా  ఏఎంబి సినిమాస్ వారు ఇప్పటికీ అదే పాత ధరలకు టిక్కెట్లు అమ్ముతున్నారని టాక్ వచ్చింది.
Image result for mahesh babu abn multiplex
అంతేకాక వాటిద్వారా దాదాపుగా రూ. 30 లక్షల రూపాయల వరకు అక్రమార్జన సంపాదించినట్లు తమ వద్దకు ఫిర్యాదులు వచ్చాయని, అందువలనే జిఎస్టి అధికారులు ఏఎంబి సినిమాస్ కు నోటీసు జారీ చేయడం జరిగిందని సమాచారం. అయితే ఈ విషయమై ఇప్పటివరకు మహేష్ బాబు నుండిగాని, ఏషియన్ సంస్థ యాజమాన్యం నుండి గానీ ఎటువంటి స్పందన రాలేదు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ వార్తహాట్ టాపిక్ గా మారి హల్ చల్ చేస్తోంది...


మరింత సమాచారం తెలుసుకోండి: