ఒక పక్క బాలయ్య ఎన్టీఆర్ బయో పిక్ తీస్తుంటే , దానికి పోటీగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ను తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లో నందమూరి ఫ్యామిలీ ని నెగటివ్ గా చూపించనున్నారని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను నెగెటివ్ యాంగిల్ లో చూపిస్తే వారు ఊరుకుంటారా? ఈ సినిమాకు నందమూరి ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి?  దీనిపై ఫిలిం నగర్లో ఒక రూమర్ ప్రచారంలో ఉంది. 

Image result for lakshmis ntr

నందమూరి కుటుంబంలో ఇప్పటికే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పై చర్చ జరుగుతోందట.  సెన్సార్ ద్వారా ఈ సినిమాను ఆపాలని వారు ప్లాన్ చేస్తున్నారట.  నందమూరి కుటుంబ సభ్యులను చెడుగా చూపించారు కాబట్టి ఆ సినిమాను రిలీజుకు ముందుగా తమకు చూపించాలని పురందేశ్వరి చేత సెన్సార్ వారిక ఒక లెటర్ రాయించారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆర్జీవీ ఈ డిమాండ్ కు ఒప్పుకోలేదని.. రిలీజ్ తర్వాత అందరితో పాటే సినిమా చూసి.. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోమని అన్నాడట. 

Image result for lakshmis ntr

  దీంతో నందమూరి కుటుంబ సభ్యులు ఈ విషయంపై ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నారట.   ఒకవేళ ఈ సినిమాపై కామెంట్లు చేయడం.. వర్మ పై మాటల యుద్ధం చేయడం లాంటివి చేస్తే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కు మరింతగా ప్రచారం కల్పించినట్టు అవుతుందని భావిస్తున్నారట. ఇప్పటికి వారు సైలెంట్ గా ఉన్నప్పటికీ వర్మ సినిమా రిలీజ్ చేసే సమయానికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: