స్వీటీ అనుష్క మళ్లీ సినిమాలతో బిజీ కానుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. సైజ్ జీరో కోసం తన బరువు పెంచుకున్న అనుష్క బాహుబలి, సింగం-3, భాగమతి సినిమాల్లో ఎలాగోలా మ్యానేజ్ చేసింది. ఈమధ్యనే తన మునుపటి లుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన అనుష్క ఇక వరుస సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ప్రస్తుతం కోనా వెంకట్ నిర్మాణ సారధ్యంలో సీక్రెట్ అనే సినిమా చేస్తున్న అనుష్క ఈ సినిమా తర్వాత మరోసారి కింగ్ నాగార్జునతో జత కట్టబోతుందని తెలుస్తుంది. నాగ్ సూపర్ హిట్ మూవీ మన్మధుడు సీక్వల్ ప్లానింగ్ లో ఉంది. అనుష్క అందులో హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆరెక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి.


అయితే ఈ న్యూస్ పై స్పందించిన పాయల్ తనకు మన్మధుడు టీం నుండి ఎలాంటి ఆఫర్ రాలేదని తేల్చి చెప్పింది. అయినా అనుష్క ఉన్నాక మిగతా అందాలను చూస్తారా చెప్పండి. అదిగాక నాగ్, అనుష్కల జోడీ అదరగొట్టేస్తుంది. సో అనుష్క సినిమాలో ఉండగా ఇంకొక హాట్ బ్యూటీకి ఛాన్స్ ఉండదని టాక్.


చిలసౌ సినిమాతో ప్రతిభ చాటుకున్న హీరో రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లోనే మన్మధుడు-2 సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇప్పటికే స్టోరీ ఫైనల్ అవగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు నాగార్జున. మరి మన్మధుడుగా నాగ్ మరోసారి ఎలాంటి హంగామా చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: