టైటిల్ చూసి ఇది కచ్చితంగా బిగ్ బాస్ కు సంబందించిన న్యూస్ అయ్యుండొచ్చని మీరు అనుకుంటే మాత్రం పొరపడినట్టే. అలా అనుకోడానికి అవకాశం లేకపోలేదు. హిందిలో బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ ఖాన్ అన్ని సీజన్స్ చేస్తూ వస్తున్నాడు. అయితే తెలుగులో మాత్రం మొదటి సీజన్ ఎన్.టి.ఆర్, రెండో సీజన్ నాని ఇలా మారుతూ వచ్చారు.


అయితే బిగ్ బాస్ సీజన్ 3 ఎన్.టి.ఆర్ నే ఊపించే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలాఉంటే ఎన్.టి.ఆర్, సల్మాన్ ఖాన్ కలిసి ఓ బ్రాండ్ కు ప్రచారకర్తలుగా ఉంటున్నారు. అంటే సౌత్ మొత్తం ఎన్.టి.ఆర్, నార్త్ మొత్తం సల్మాన్ ఖాన్ చూసుకుంటారన్నమాట. ఇంతకీ ఆ డీల్ ఏంటి అంటే.. పార్లే ఆగ్రోకి చెందిన అప్పీ ఫిజ్ కు వీరు ప్రచారకర్తలుగా ఉండటమే.


సౌత్ అన్ని భాషల్లో ఎన్.టి.ఆర్ అప్పీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాడట. దీనికోసం భారీ మొత్తం తారక్ కు ఇస్తున్నారట. ఇప్పటికే నార్త్ లో సల్మాన్ ఖాన్ అప్పీ ఫిజ్ యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు సౌత్ లో కూడా ఆ యాడ్ రాబోతుంది. ఎన్.టి.ఆర్ అందులో కనిపించనున్నాడు. ఇప్పటివరకు ఎన్.టి.ఆర్ సెలెక్ట్ మొబైల్స్, నవరత్న తైళం, బోరో ప్లస్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.


మరి ఎన్.టి.ఆర్ ప్రచారంతో అప్పీ ఫిజ్ కు సేల్స్ పరంగా ఎలా ప్లస్ అవుతుందో చూడాలి. వేసవి కాలం వచ్చేసింది కాబట్టి ఈ సీజన్ లో ఈ శీతలపానీయం బాగానే ప్రమోట్ చేసేలా ఉన్నారు. సినిమాలతో పాటుగా వాణిజ్య ప్రకటనలతో ఎన్.టి.ఆర్ బిజీ అవుతున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: