టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఆ దర్శకుడు తీసిన సినిమాలు నాలుగు..అవన్నీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.  ఇంతకీ ఆ దర్శకుడు ఎవరా అనుకుంటున్నారా..ఆయనే కొరటాల శివ.  మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్,భరత్ అనే నేను సినిమాలతో కొరటాల శివ స్టార్ దర్శకుడిగా ఎదిగారు.  ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తీయడానికి సిద్దమవుతున్న విషయం తెలిసిందే.  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ పెను సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి ప్రస్తుతం మద్రాస్ లో ఉంటుంది. 
Image result for sri reddy comments koratala
తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్, పలువురు సీనీ,రాజకీయ నాయకులపై కామెంట్స్ పోస్ట్ చేస్తూనే ఉంది.  తాజాగా ఆమె దర్శకులు కొరటాల శివను టార్గెట్ చేసుకొని దారుణమైన వ్యాఖ్యలు చేసింది.  నేను జీవితంలో  మర్చిపోలేని ఒకే ఒక వ్యక్తి అదే కొరటాల శివ అంత నీచమైన వ్యక్తి మరొకరు లేరు అతడు కామసూత్ర బాస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నా బయోపిక్ అంటూ తీస్తే అందులో మేజర్ పార్ట్ కొరటాల శివ దే ఉంటుందని , ప్రపంచంలోనే అత్యంత పరమచెత్త క్యారెక్టర్ లలో కొరటాల శివ ది నెంబర్ వన్ స్థానమని సంచలన వ్యాఖ్యలు చేసింది. 

సొసైటీ గురించి అనుక్షణం ఆలోచించే కొరటాలపై ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.  దీనికి ప్రూఫ్ ఏంటని ప్రశ్నించడంతో..ఎదపై చేతులు వేసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది.  శ్రీరెడ్డి పోస్ట్ పై ఇప్పుడు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  తమ అభిమాన హీరోలకు సూపర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడిపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.  సోషల్ మీడియాలో మరోసారి శ్రీరెడ్డిపై ట్రోలింగ్ మొదలు పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: