టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ప్రముఖ నిర్మాత, దర్శకులు విజయబాపినీడు మరణ వార్త మర్చిపోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ దర్శక, నిర్మాత, నటులు కోడి రామకృష్ణ నిన్న కన్నుమూశారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే టాలీవుడ్ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.  ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు వద్ద శిశ్యరికం చేసిన కోడి రామకృష్ణ ఆయన ప్రోత్సాహంతో మెగాస్టార్ చిరంజీవి తో ‘ఇంట్లో రామయ్య, విధిలో కృష్ణయ్య’సినిమా ద్వారా దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. 

ఆ తర్వాత వంద సినిమాలు తీసి రికార్డు సృష్టించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా అద్భుతమైన నటన ప్రదర్శించే వారు కొడి రామకృష్ణ.  టాలీవుడ్ సీనీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.  ఈ నేపథ్యంలో సినీనటి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి భావోద్వేగానికి లోనయ్యారు. శాంతమ్మా అంటూ ఆప్యాయంగా తనను దీవించే కోడి రామకృష్ణ చనిపోవడంతో బోరున విలపించారు. టి.కృష్ణ వంటి దర్శకుడి తర్వాత తాను గౌరవించి అభిమానించే ఇద్దరు మహోన్నత స్థాయి కలిగిన దర్శకులు దర్శకరత్న దాసరి  నారాయణరావు, కోడి రామకృష్ణలేనన్నారు.

బిడ్డా అని అభిమానంతో పిలిచే దాసరి నారాయణరావు, శాంతమ్మా అని ఆప్యాయతలతో దీవించే కోడి రామకృష్ణలను కోల్పోవడం జీవితంలో తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 10 సినిమాలలో తాను నటించానని అయితే వాటిలో 8 సూపర్ హిట్ అయ్యాయంటూ చెప్పుకొచ్చారు.మిమ్మల్ని ఎప్పటికీ గౌరవించుకుంటూనే ఉంటాం సార్ అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: