సినిమాలంటే ప్రాణం..సినిమా కోసమే జీవితం అనేలా ప్రతిరోజూ తన మనుగడ సాగించారు..చనిపోయేటప్పుడు కూడా యాక్షన్ అని చెబుతూ చనిపోవాలి అని స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ మనసులో ఒక లైన్ బలంగా పాతుకుపోయింది.  కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన నిర్మాతలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని రంగంలోకి దిగేవారు. అందుకే ఒక సినిమా ఫెయిల్ అయినా మరో సినిమాతో నిర్మాతకు మంచి హిట్ ఇచ్చేవారు.  ఈ విషయాలు అన్ని టాలీవుడ్ లో ఆయనతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. 

అందుకే కోడీ రామకృష్ణ అంటే సినీ నటులకే కాదు ఇతర విభాగాల్లో ఉన్న వారికి కూడా వల్లమాలిన అభిమానం.  ఆయన మరణ వార్త విన్న వెంటనే ఒక్కసారే దుఖఃంతో కుంగిపోయారు..అంత గొప్ప దర్శకుడిని మళ్లీ ఎప్పుడు చూస్తామని ఆవేదన వ్యక్తం చేశారు.  కోడి రామకృష్ణ 2016లో చివరగా చేసిన చిత్రం నాగరహవు. రెండేళ్ల గ్యాప్ రావడంతో సినిమాలు చేయాలనీ మూడు కథలను సిద్ధం చేసుకున్నట్లు కోడి రామకృష్ణ పెద్ద కూతురు దివ్యా దీప్తి తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. నాన్నగారి దగ్గర నేను 2002 నుంచి 2007 వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను.

ఆ తర్వాత నాకు వివాహం జరిగింది..దాంతో లైఫ్ బిజీగా మారిపోవడంతో డైరెక్షన్ చేయడం కుదరలేదు. కానీ సినిమా డైరెక్ట్ చేయాలనే ఆలోచన మాత్రం నాకు ఉంది..అంతే కాదు నాన్నగారు రాసుకున్న మూడు కథలు రెడీగా ఉన్నాయని అయితే వాటిని చేయగలనని తనకు నమ్మకం కలిగితేనే టచ్ చేస్తాను అని చెబుతూ లేకుంటే వాటి జోలికి వేళ్ళను అన్నారు.  నాన్నగారు తన ఆరోగ్యం గురించి ఎప్పుడూ బెంగ పడేవారు కాదు..ఎప్పుడూ స్టాంగ్ గానే ఉన్నానని అంటూ ఉండేవారు. 2012లో మొదటిసారి గుండెపోటుకు గురైన నాన్నగారు ఎన్నడు తన ఆరోగ్యం గురించి బయపడలేదు.  సినిమానే ప్రాణమని ఎప్పుడు సినిమా ప్రపంచం గురించే ఆలోచించేవారని దీప్తి తెలియజేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: