తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా పేరొందిన నందమూరి తారక రామారావు – ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు రిలీజయ్యాయి. ఫస్ట్ పార్ట్ అంతంతమాత్రమే ఆడింది. రెండో పార్ట్ లో రాజకీయ జీవితంపై ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తారని భావించారు. ఈ నేపథ్యంలో విడుదలైన మహానాయకుడు ప్రస్తుతం ప్రేక్షకుల ముందు ఉంది. అయితే రెండో పార్ట్ తన పాత్రను నెగెటివ్ గా చిత్రీకరించారని, అదే జరిగితే పరువు నష్టం దావా వేసి కోర్టు కీడుస్తానని నాదేండ్ల భాస్కర రావు హెచ్చరించారు. మరి ఇప్పుడు సినిమా రిలీజైంది. నాదెండ్ల భాస్కర రావు ఏమంటున్నారు..?

Image result for ntr mahanayakudu
          ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. సినిమాల్లో, రాజకీయాల్లో ఉన్న ఆయన టీనేజ్ తర్వాత ప్రజా జీవితంలోనే గడిపారు. దీంతో ఆయనకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలు ప్రజలకు సుపరిచితమే. అయినా ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్సుకత నిత్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నానని బాలకృష్ణ ప్రకటించగానే తెలుగు జాతి మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది. లక్ష్మి పార్వతి ఎపిసోడ్, నాదెండ్ల భాస్కర రావు ఎపిసోడ్, చంద్రబాబు ఎపిసోడ్ లను ఎలా చూపిస్తారోనని అందరూ ఎదురు చూశారు.

Image result for ntr mahanayakudu

ఫస్ట్ పార్ట్ మొత్తం సినిమా నేపథ్యంలోనే సాగడంతో ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రెండో పార్ట్ మొత్తం రాజకీయ నేపథ్యంలోనే సాగుతుంది. రాజకీయాల్లోకి ప్రవేశించింది మొదలు జరిగిన అనేక పరిణామాలను ఇందులో చూపించారు.  ముఖ్యంగా నాదెండ్ల ఎపిసోడ్ ను ట్రైలర్ లో నెగెటివ్ కోణంలో చూపించారు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ అయ్యాక వివాదాలు తప్పవేమోనని అందరూ భావించారు. అయితే సినిమా రిలీజైంది. నాదెండ్ల కూడా తన పాత్రను చూసుకున్నారు. తనను నెగెటివ్ గా చూపిస్తే సహించేది లేదు న్యాయ పోరాటం చేస్తానని సినిమాకు ముందే హెచ్చరించిన నాదెండ్ల.. ఇప్పుడు ఎందుకు కామ్ అయిపోయారనేది ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న.

Image result for ntr mahanayakudu

సినిమా రిలీజైన తర్వాత నాదెండ్ల మనోహర్ ను మీడియా కలిసింది. వాళ్లందరికీ నాదెండ్ల చెప్పింది ఒక్కటే.. “నిర్ణయాన్ని ప్రజలకే వదిలేస్తున్నా” అని..!! అంటే తన పాత్రపై తనకు పెద్దగా అభ్యంతరం లేదని నాదెండ్ల భావించారా.. అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అందుకే ఆయన న్యాయపోరాటాన్ని విరమించుకున్నారని సమాచారం. అంటే తన పాత్ర సందర్భోచితంగానే ఉందని, జరిగిన విషయాలనే చూపించారని నాదెండ్ల అంగీకరించారా.. అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై రాద్దాంతం చేస్తే మరింత పెరిగి ముదరడం తప్ప ఉపయోగం లేదని నాదెండ్ల భావించినట్లున్నారు. అందుకే ప్రజలకే నిర్ణయాన్న వదిలేసి న్యాయపోరాటాన్ని విరమించుకున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: