నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్ముస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ అనగానే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా టైటిల్ మళ్లీ వాడితే రాం చరణ్, అల్లు అర్జున్ లు వాడుతారని అనుకున్నారు కాని నానికి ఆ టైటిల్ ఇచ్చారు.


మెగా హీరోలకు కాకుండా నాని గ్యాంగ్ లీడర్ టైటిల్ ఇచ్చేశారు. ఈరోజు నాని బర్త్ డే సందర్భంగా సినిమాకు సంబందించి టైటిల్ తో పాటుగా టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ ముందు సత్య హీరో అండ్ ఫ్యామిలీ గురించి చెప్పే డైలాగ్స్ తో టీజర్ వచ్చింది. విక్రం కుమార్ ఇదవరకు సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది.


ఐదుగురు లేడీస్ ను మ్యానేజ్ చేసే లీడర్ గా గ్యాంగ్ లీడర్ అవుతున్నాడు నాని. సరదాగా సాగే ఈ సినిమాకు అంత పవర్ ఫుల్ టైటిల్ ఎలా కుదురుతుందో చూడాలి. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా చేస్తున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని మిడిల్ ఏజ్ పర్సన్ గా కనిపించనున్నాడు.


ఈమధ్య వచ్చిన జెర్సీ టీజర్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. 6 వరుస సినిమాలు చేసిన తర్వాత కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో కొద్దిగా వెనక్కి తగ్గిన నాని మళ్లీ జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో సత్తా చాటేలా ఉన్నాడు. అలా జరిగితే మళ్లీ నానికి గుడ్ టైం స్టార్ట్ అయినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: