ఎస్వి కృష్ణా రెడ్డి డైరక్షన్ లో అప్పటిదాకా కమెడియన్ గా ఉన్న ఆలిని హీరోగా చేస్తూ వచ్చిన సినిమా యమలీల. మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆలి కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఆలిలో కమెడియన్ మాత్రమే కాదు ఓ హీరో కూడా ఉన్నాడని ఆ సినిమా ద్వారా తెలిసింది. అయితే అసలు ఈ ఆఫర్ ముందు ఆలికి రాలేదట.


సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ఇప్పటి సూపర్ స్టార్ మహేష్ బాబుకి వచ్చిందట. అప్పటికే వేసవి సెలవుల్లో సినిమాలు చేస్తూ వస్తున్న మహేష్ తో కృష్ణారెడ్డి ఈ సినిమా చేయాలని అనుకున్నారట. కాని కృష్ణ గారు వద్దనేశారట. స్టడీస్ డిస్ట్రబ్ అవ్వొద్దని యమలీల ఆఫర్ ను తిరస్కరించాడట. 1994లో యమలీల సినిమా తెరకెక్కింది. 


1999లో మహేష్ హీరోగా రాజకుమారుడు సినిమా చేశాడు. ఒకవేళ మహేష్ యమలీల చేసి ఉంటే కచ్చితంగా సినిమా ఇంకాస్త ఎక్కువ ఇంప్యాక్ట్ చూపించేది. మదర్ సెంటిమెంట్ తో ఆలి కూడా ఆ సినిమాలో అదరగొట్టాడు. ఈమధ్యనే పరిశ్రమలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలికి సత్కారం జరిగింది.   


ఆ తర్వాత జరిగిన ఇంటర్వ్యూస్ లో ఆలి యమలీల సినిమా గురించి ఈ సీక్రెట్ బయట పెట్టాడు. ఆలి కెరియర్ లో యమలీల సినిమా ఓ మైల్ స్టోన్ లాంటిదని చెప్పొచ్చు. హీరోగా సక్సెస్ అయినా కమెడియన్ గా మాత్రం అవకాశాలను వదులుకోలేదు. అందుకే సుధీర్గ కెరియర్ కొనసాగించాడు ఆలి.


మరింత సమాచారం తెలుసుకోండి: