నిన్న జరిగిన 118 సినిమా ఆడియో ఫంక్షన్ లో బాలకృష్ణ మీద ఎన్టీఆర్ పరాజయం ప్రభావం ఇంకా ఉందని క్లియర్ గా అర్ధం అవుతుంది. నందమూరి బాలకృష్ణ కలలో కూడా ఊహించలేదు. తాను తన తండ్రి జీవితకథ ఆధారంగా తీసిన సినిమా ఇంత దారుణ పరాజయం పొందుతుందని. సినిమా ఫస్ట్ పార్ట్ విడుదలకు ముందు ఆ సినిమాకు వున్న బజ్ ఇంతా అంతా కాదు. దానిని కొనడానికి బయ్యర్లు ఎగడబడిన వైనం కూడా ఇంతా అంతా కాదు.

Image result for kalyan ram 118  balakrishna

అయితే ఫస్ట్ పార్ట్ మంచి ప్రశంసలు అందుకుంది. డబ్బులు మాత్రంరాలేదు. కానీ పేరు వచ్చింది కాబట్టి కాస్త ఊరట కలిగింది. రెండోభాగం మహానాయకుడు మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ భాగం మరీ దారుణంగా డిజాస్టర్ అయింది. కలెక్షన్లు చూస్తుంటే ఇంత దారణమా? జనాలు ఓ సినిమాను ఇంత దారుణంగా తిరస్కరిస్తారా? సినిమా విడుదలయిన ఆదివారంనాడు, హైదరాబాద్ లో షోకి ఏనిమిది వేలు కలెక్షన్ నా?

Related image

ఇప్పుడు ఇదే నందమూరి బాలకృష్ణను షాక్ కు గురిచేసినట్లు తెలుస్తోంది. ఆయన కెరీర్ లో డిజాస్టర్లు లేకపోలేదు. కానీ ఇది ఆయన నిర్మాతగా తొలి చిత్రం. ఆయన భార్యను నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన చిత్రం. అలాంటి సినిమా ఇలా అయిపోవడం అంటే బాలయ్య తట్టుకోలేపోతున్నట్లు కనిపిస్తోంది. నిన్న జరిగిన 118 ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన నందమూరి హీరోలు, సినిమా సభకు వచ్చినట్లు లేరు. ఏదో సంతాప సభకు వచ్చినట్లు కనిపించారు. ముగ్గురు మొహాలు వీర సీరియస్ గా వున్నాయి. బాలయ్య స్పీచ్ అస్సలు ఇంత నిస్సారంగా, ఇంత చప్పగా గతంలో ఎన్నడూ లేదు. దానికి తగినట్లే కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సీరియస్ గా మొహాలు పెట్టుకుని వుండిపోయారు. అలాగే మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: