టాలీవుడ్ లో ఈ మద్య వరుసగా విజయాలు అందుకుంటున్న యూత్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’సినిమాలో హీరోయిన్ గా నటించిన  ప్రియాంక జవాల్కర్ అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించింది.  ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రియాంక జవాల్కర్ కి టాలీవుడ్ లో వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. టాక్సీవాలా లో గ్లామర్ పరంగా ప్రియాంక బాగా ఆకర్షించింది.  ఆ మద్య రవితేజ డిస్కోరాజాలో ఎంపికైనట్టు వార్తలు వచ్చినా.. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. 
Image result for akhil priyanka jawalkar
గీతా ఆర్ట్స్ లో సినిమా కాబట్టి సినిమాపై అంచనాలు ఉన్నాయి.  తాజాగా అఖిల్ నాల్గొవ సినిమాలోను చోటు దక్కే అవకాశాలు ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా గీతా ఆర్ట్స్ వారు ఒక సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో అఖిల్ సరసన  ప్రియాంక జవాల్కర్  నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారట..అందుకే ఆమెను సంప్రదిస్తున్నారని సమాచారం. 
Image result for akhil priyanka jawalkar
అఖిల్ మొదటి మూడు సినిమాలు ఫెయిల్ కావడంతో నాలుగో సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ కి బొమ్మరిల్లు, పరుగు తరువాత ఒక్క హిట్ కూడా పడలేదు. ఒంగోలు గిత్త సినిమా తరువాత భాస్కర్ మరలా సినిమా చేయలేదు.  అల్లు అర్జున్ కోసం కథను రెడీ చేసుకుంటే ఆ కథ అఖిల్ కు సెట్ అయింది.  గీతా ఆర్ట్స్ లో మూవీ కనుక ఈసారైనా అఖిల్ మంచి హిట్ కొడతాడేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: