తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హూస్ట్ గా వ్యవహరించారు.  ఈ సీజన్ ఎంతో సక్సెస్ తో కొనసాగింది..ఇంటి సభ్యులు కూడా ఎంతో హుందాగా వ్యవహరించారు.  బిగ్ బాస్ సీజన్ 1 కి శివబాలాజీ విన్నర్ గా నిలిచారు.  బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వచ్చారు.  ఆ సమయానికి ఎన్టీఆర్ షూటింగ్ బిజీలో ఉండటంతో నాని ఎంట్రీ ఇచ్చారు.  అయితే ఈ సిజన్ మొదటి రోజు నుంచే కాంట్రవర్సీ మొదలైంది. బిగ్ బాస్ 2 లో కౌశల్ అందరికీ గట్టి పోటీ ఇస్తూ వచ్చారు.  ఇదే సమయంలో ఆయనకు కౌశల్ ఆర్మీ ఏర్పాటు కావడం..బిగ్ బాస్ కంటిస్టెంట్లను బయటకు పంపే స్థాయిలో వారి ఓటింగ్ నడిచిందని వార్తలు వచ్చాయి. 
Image result for big boss 2 telugu koushal
‘బిగ్ బాస్’ సీజన్ 2లో పాల్గొన్న దగ్గర నుంచి కౌశల్ బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. 'బిగ్ బాస్ 2'లో విజేతగా నిలిచిన దగ్గర నుంచి ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కౌశల్ విజేతగా నిలవడం వెనుక 'కౌశల్ ఆర్మీ' కీలకమైన పాత్రను పోషించింది.  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కౌశల్ పై కొంత మంది విమర్శలు చేశారు..ఆయన ఫేక్ ఓటింగ్ ఏర్పాటు చేసుకొని డబ్బు ఇచ్చి ఆర్మీని తయారు చేశారని..అందుకే కౌశల్ అవలీలగా గెలిచాడని అన్నారు. 
Related image
కౌశల్ చేసిన ఈ కామెంట్స్ కి కూడా సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎదురవుతోంది. ఇక నీ పనైపోయిందని కొందరు అంటుంటే.. మరికొందరు కౌశల్ కి వార్నింగ్ లు ఇస్తున్నారు.  ఈ నేపథ్యంలో కౌశల్   తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.  ఓ టీవీ ఛానెల్ లో కౌశల్ ఆర్మీ సభ్యులు కొందరు కౌశల్ పై చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.
Image result for big boss 2 telugu koushal
'బిగ్ బాస్' హౌస్ లో వున్నప్పుడు నేను ఎలా ఉన్నానో .. ఇప్పుడూ అలాగే వున్నాను. నాలో ఎలాంటి మార్పు రాలేదు .. నా వ్యక్తిత్వం అప్పుడు ఎలా వుందో ఇప్పుడూ అలాగే వుంది. కొంతమంది నన్ను కిందికి లాగడం కోసం పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారు.  ఇటువంటి చెత్తపై మాట్లాడే ఇంటరెస్ట్ కూడా తనకు లేదని, ఇలాంటి నిరాధారమైన విషయాలపై స్పందిస్తూ పోతే తనను మరింత తగ్గించాలని చూస్తారని అన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: