యువ హీరో విజయ్ దేవరకొండకు కేవలం రౌడీ స్టార్ మాత్రమే కాదు టాలీవుడ్ ముద్దుల హీరో అన్న బిరుదు కూడా తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి కాదు అంతకుముందు వచ్చిన ద్వారక సినిమా నుండి విజయ్ దేవరకొండ సినిమా అంటే చాలు అందులో మూతి ముద్దుల హంగామా ఉండాల్సిందే. యూత్ ఆడియెన్స్ కు అవే నచ్చేస్తున్నాయనుకోండి.  


ఇదిలాఉంటే గీతా గోవిందం సినిమాలో ఓ ముద్దు పెట్టడం వల్లే కథ అంతా అడ్డం తిరిగి రష్మిక చుట్టూ మేడం మేడం అంటూ తిరగాల్సి వచ్చింది. ఆ సినిమాతో జోడీ కట్టిన ఆ హాట్ పెయిర్ మళ్లీ డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్, రష్మికలు మరోసారి ముద్దులాట ఆడుతున్నారట.


విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ కాగ సినిమా మొత్తం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందట. అందుకే కాలేజ్ డేస్ లో ఉండే సీన్స్ స్పెషల్ గా తెరకెక్కిస్తున్నారట. విజయ్ దేవరకొండ, రష్మిక ఇప్పటికే క్రేజీ పెయిర్ గా మారగా ఆ ఇద్దరు కలిసి నటిస్తున్న డియర్ కామ్రేడ్ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.


సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక లిప్ లాక్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి విజయ్ తో రష్మిక చేసే ఈ రొమాన్స్ సినిమాకు ఎలా ప్లస్ అవుతుందో చూడాలి. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా తెలియలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: