తాజాగా ఇంటర్వ్యూ లో తమన్నా ను విరాట్ తో డేటింగ్ చేశారా అని ప్రశ్నించారు. అయితే అప్పట్లో ఈ రూమర్ బాగా షికారు చేసింది. 14 ఏళ్ళ క్రితం ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ లో చాలామంది టాప్ స్టార్ల సినిమాలలో నటించింది. సౌత్ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించింది.  ఇప్పుడు కాస్త ఊపు తగ్గింది కానీ నాలుగేళ్ల క్రితం వరకూ స్టార్ హీరోయిన్ గానే చెలామణీ అయ్యేది. నటన.. స్టార్డం మాత్రమే కాదు తమన్నాపై అప్పట్లో డేటింగ్ రూమర్లు కూడా చాలానే వచ్చాయి.


తమన్నా ఇప్పుడెందుకు రాజమౌళికి బిస్కెట్స్ వేస్తుంది ..!

అలాంటి రూమర్లలో ఒకటి విరాట్ కోహ్లి తో ఎఫైర్ రూమర్.  2012 లో విరాట్ కోహ్లితో కలిసి తమన్నా ఒక ఫోన్ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ లో నటించింది. అప్పటికి బీకాం లో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఇంకా ప్రవేశ పెట్టలేదు కానీ కొందరు సెలబ్రిటీల మధ్య కెమిస్ట్రీ మాత్రం ఉండేది.  అలాంటి కెమిస్ట్రీ విరాట్ - తమన్నా ల మధ్య కుదిరిందని.. చెట్టాపట్టాలేసుకొని తిరిగారని అప్పట్లో మీడియా కోడై కూసింది.  అదే విషయంపై విరాట్ కోహ్లిని.. తమన్నాను ప్రశ్నిస్తే అవన్నీ రూమర్లని కొట్టిపారేశారు.


తమన్నా ఇప్పుడెందుకు రాజమౌళికి బిస్కెట్స్ వేస్తుంది ..!

 ఇదిలా ఉంటే రీసెంట్ గా 'ఫేమస్లీ ఫిలింఫేర్' అనే చాట్ లో సదరు ఎఫైర్ గురించి తమన్నాను మరోసారి ప్రశ్నించారు.  దీనికి గట్టిగానే సమాధానం ఇచ్చింది మిల్కీ బ్యూటీ.  ఆ యాడ్ షూటింగ్ తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా విరాట్ ను కలవలేదని చెప్పింది. అంతే కాదు.. ఆ యాడ్ షూటింగ్ సమయంలో కూడా ఏదో మర్యాదపూర్వకంగా నాలుగు మాటలు మాట్లాడుకున్నామని అంతకు మించి ఇంకేమీ లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: