బాలీవుడ్ లో దుమ్ముదులిపేసిన బిగ్ బాస్ రియాలిటీ షోని సౌత్ ఆడియెన్స్ కు పరిచయం చేశారు. ముఖ్యంగా తెలుగు వారికి ఈ షోని పరిచయం చేస్తూ ఎన్.టి.ఆర్ ను వ్యాఖ్యాతగా పెట్టారు స్టార్ మా వాళ్లు. బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా అదరగొట్టాడు. ఆ సీజన్ షో నడిచినంతకాలం స్టార్ మా ని టాప్ ప్లేస్ లో ఉంచేలా చేసింది.


ఇక బిగ్ బాస్ సెకండ్ సీజన్ నాని హోస్ట్ గా చేశాడు. వ్యాఖ్యాతగా నాని క్రేజ్ కన్నా కంటెస్టంట్ కౌశల్ కోసం ఓ ఆర్మీ ఏర్పడి షోని ఎలాగోలా నడిపించారు. కౌశల్ ఆర్మీ వల్లే బిగ్ బాస్ 2 సక్సెస్ అయ్యిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 3కి సిద్ధం చేస్తుంది స్టార్ మా. 


ఈసారి కామన్ మెన్ కు అవకాశం లేదని తెలుస్తుంది.. అంతేకాదు సెలబ్రిటీస్ విషయంలో కూడా ఆచి తూచి అడుగులేస్తున్నారట. మూడవ సీజన్ హోస్ట్ గా ఎన్.టి.ఆర్ ఇప్పటికే ఓకే అన్నట్టు తెలుస్తుంది. ఈ సీజన్ కోసం ఎన్.టి.ఆర్ ఏకంగ 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.


ఇక బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టంట్ గా ఉదయభాను, యాంకర్ మంజూషా, వరుణ్ సందేష్, జెడి చక్రవర్తి, హీరోయి పూజిత పొన్నాడ సెలెక్ట్ అయ్యారని తెలుస్తుంది. ఈసారి కూడా 16 మంది కంటెస్టంట్స్ తో ఈ షో ఉంటుందని అంటున్నారు. బిగ్ బాస్ 2 జరిగిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే సీజన్ 3 కూడా ఉంటుందట. జూన్ లో బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: