బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఇప్పటికే ఈ సినిమా మొదటి మేకింగ్ వీడియో బైట్ వదిలింది. అయితే ఇప్పుడు తాజాగా శ్రద్దా కపూర్ బర్త్ డే సందర్భంగా సాహో చాప్టర్ ను వదిలారు. మీడియా అంతా ఈ రెండో వీడియో బైట్ పట్ల కాస్త పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది. అయితే ఇప్పుడు నిర్మాతలు ఈ సినిమా డీల్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. సాహో తెలుగు - తమిళం - మలయాళం - హిందీ వెర్షన్ల థియేట్రికల్ రైట్స్ కి గంపగుత్తగా రూ.240 కోట్లు ఆఫర్ చేసిందని ప్రచారమైంది.


సాహో చాప్టర్ 2 : రెస్పాన్స్ ఎలా ఉంది ...!

అయితే ఆ ఆఫర్ ని యువి క్రియేషన్స్ సంస్థ రిజెక్ట్ చేసిందని 350 కోట్లు డిమాండ్ చేసిందని వేరొక ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం `షేడ్స్ ఆఫ్ సాహో` మేకింగ్ 2 యూట్యూబ్ - సామాజిక మాధ్యమాల్లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఆ క్రమంలోనే ఓవర్సీస్ డీల్ గురించి ముచ్చట సాగుతోందట.`సాహో` ఓవర్సీస్ నిర్మాతలు ఎంత డిమాండ్ చేస్తున్నారు? అంటే... అమెరికా సహా విదేశాలకు సంబంధించి హక్కుల కోసం యు.వి.సంస్థ 45 కోట్లు డిమాండ్ చేస్తోందట.

సాహో చాప్టర్ 2 : రెస్పాన్స్ ఎలా ఉంది ...!

అయితే ఇంత పెద్ద మొత్తం రాబట్టాలంటే మరోసారి `బాహుబలి` రేంజులో వసూళ్ల దూకుడు ప్రదర్శించాల్సి ఉంటుంది. బాహుబలి చిత్రం 10 మిలియన్ డాలర్స్ (70) క్లబ్ లో చేరింది. అంత దూకుడు `సాహో` చూపిస్తేనే అది వర్కవుటవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ హక్కుల విషయమై చర్చలు సాగిస్తోందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: