టాలీవుడ్ లోకి ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత తన సహనటుడు అయిన అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  వీరి వివాహం జరిగి సంవత్సరం అవుతుంది.  వివాహం జరిగిన మూడు నెలలకే భార్యాభర్తలు షూటింగ్ బిజీలో పడిపోయారు.  సమంత నటించిన మహానటి, రంగస్థలం, అభిమన్యుడు మంచి హిట్ అయ్యాయి. 
Image result for samantha sarwanand
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉన్న సమంత మరో కొత్త సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. కోలీవుడ్ లో వైవిధ్యభరితమైన మూవీగా ‘96’మంచి మార్కులు కొట్టేసింది.  ఈ సినిమలో  విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు.  ప్రస్తుతం ఈ సినిమా  తెలుగులో రీమేక్ చేయడానికి దిల్ రాజు సిద్ధమయ్యారు.  విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్, త్రిష పాత్రలో సమంతను తీసుకోనున్నట్లు సమాచారం.
Image result for samantha sarwanand
అయితే ఈ సినిమా తెలుగు నేటివిటికి తగ్గట్టు కథలో చిన్న మార్పులు చేయించి టైటిల్ కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టు  'జాను' .. 'జాను అలియాస్ జానకి' అనే రెండు పేర్లను పరిశీలించారు. అంతేకాదు  'జానకీదేవి' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట.  ఫైనల్ గా ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. 

ఈ నెల 6వ తేదీన శర్వానంద్ పుట్టినరోజు..అదే రోజు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్.  ఏప్రిల్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: