కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న అక్కడ కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఇక తెలుగులో ఛలో, గీతా గోవిందం సినిమాలతో ఇక్కడ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. రష్మికతో సినిమా అంటే దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక ఈమధ్యనే కన్నడలో ఓ సినిమా చేసింది.


అక్కడ స్టార్ హీరో దర్శన్ హీరోగా వచ్చిన యజమాన సినిమాలో హీరోయిన్ గా నటించింది రష్మిక. ఈ సినిమా మార్చి 1న రిలీజైంది. అయితే కర్ణాటకలో రష్మిక క్రేజీ ఫ్యాన్స్ రష్మిక భారీ కటౌట్ పెట్టడమే కాకుండా ఆ కటౌట్ కు పాలాభిషేకం కూడా చేశారు. సాధారణంగా ఇలా కేవలం స్టార్ హీరోలకు మాత్రమే చేస్తారు.  


View this post on Instagram

#rashmikamandanna #yajamana #cutout ❤️😻

A post shared by Rashmika Mandanna 🔵 (@rashmikaaa_mandanna) on

కాని రష్మిక కటౌట్ కు పాలాభిషేకం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మికకు కటౌట్ పెట్టడమే గ్రేట్ అనుకుంటుంటే ఇలా పాలాభిషేకం చేసి ఆమెపై తమ అభిమానం చాటుకున్నారు కన్నడ ఫ్యాన్స్. ఇలా స్టార్స్ కటౌట్ కు పాలాభిషేకం చేసి పాలు ఎందుకు వేస్ట్ చేస్తారంటూ కొందరు అంటున్నార్ అభిమానం చూపించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ కాబట్టి వారిని ఏమి అనలేని పరిస్థితి.


తెలుగు, కన్నడ భాషల్లో రష్మిక హంగామా చేస్తుండగా లేటెస్ట్ గా కార్తి సినిమాతో తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్టింది రష్మిక మందన్న. మరి అమ్మడి టాలెంట్ కు అక్కడ ఫ్యాన్స్ కూడా కటౌట్లు పెడతారేమో చూడాలి. రోహిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకుని సినిమాలతో బిజీ అవుతుంది. మొత్తానికి రష్మిక తన టాలెంట్ తో సౌత్ ఆడియెన్స్ అందరిని అలరిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: