టాలీవుడ్, కోలీవుడ్ లో హర్రర్, కామెడీ తరహా సినిమాలతో నవ్విస్తూనే భయపెడుతున్న దర్శకుడు లారెన్స్ రాఘవేంద్ర.  కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టిన లారెన్స్ తర్వాత నటుడిగా, దర్శకుడిగా మారారు.  ముని సినిమాతో హర్రర్, కామెడీ తరహా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న లారెన్స్ తర్వాత కాంచన, కాంచన 2 సినిమాతో మంచి విజయాలు అందుకోవడమే కాదు..భారీ కలెక్షన్లు కూడా సాధించాయి.  ప్రస్తుతం ఇదే సీరీస్ లో మరో హారర్ థ్రిల్లర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Related image
ఈ నేపథ్యంలో 'కాంచన 3' కోసం చకచకా కథను పూర్తి చేసేసిన లారెన్స్ రంగంలోకి దిగిపోయాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టి త్వరగా పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. అయితే కాంచన 3 లో లారెన్స్ డిఫరెంట్ స్టైల్లో కనిపించబోతున్నారట.  ఈసారి గ్రాఫిక్ టెక్నాలజీ కూడా బాగానే వాడబోతున్నారట. అయితే ఈ సినిమా ఏప్రిల్ 18 న రిలీజ్ చేయాలని భావించారు..ఆ సమయంలో పైడి పల్లి వంశి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ‘మహర్షి’సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.  దాంతో కాంచన 3 పోస్ట్ పోన్ చేశారు. 
Image result for kanchana 3 movie
కానీ ఇప్పుడు మహర్షి షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ మే 9న చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.   ఈ నేపథ్యంలో  'కాంచన 3' మే 1కి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట లారెన్స్.    ఈ సినిమాలో లారెన్స్ సరసన ఓవియా, వేధిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.  మరి ఈసారి లారెన్స్ ఏ రేంజ్ లో భయపెట్టిస్తాడో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: