టాలీవుడ్లో బయటకు చెప్పని లుకలుకలు ఎన్నో ఉన్నా పైకి మాత్రం బాగానే ఉంటుంది. అయితే టాప్ హీరోల మధ్య ఇగోలు, గొడవలు అన్నీ కూడా తెరచాటునే ఉంటాయి. టాలీవుడ్లో వర్గాలు ఎన్ని ఉన్నా అంతా గ్రూప్ ఫోటోలు ఇస్తూ ఉంటారు. అయితే అపుడపుడు ఐక్యతకు శీల పరీక్ష పెట్టేలాకొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.


ఇపుడు చూస్తే టాలీవుడ్లో విభేదాలు బయట పెట్టడానికా అన్నట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వచ్చిపడ్డాయి.  ప్రస్తుత మా అధ్యక్షుడు శివాజీరాజాది ఓ ప్యానల్ అయితే, మరో ప్యానల్ సీనియర్ నటుడు నరేష్ ది.  ఈ ప్యానల్లో వైఎస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్,  జనరల్ సెక్రటరీగా జీవిత పోటీలో ఉన్నారు. ఇక శివాజీ ప్యానల్లో ఉన్న వారంతా మెగా ఫ్యామిలీకి దగ్గర వారే. హీరో శ్రీకాంత్, రచయత  పరుచూరి వెంకటేశ్వరరావు వంటి వారితో పాటు అనేకమంది ఉన్నారు.


మా తొలి అధ్యక్షుడు చిరంజీవి. ఆయన తరువాత తమ్ముడు నాగబాబు కూడా ఆ పదవి చేపట్టారు. తరువాత చాలా కాలం సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆ పదవిలో కుదురుకున్నారు. అప్పట్లో దాసరి నారాయణరావు వంటి పెద్దలు ఆశీస్సులు మురళీమోహన్ కి ఉన్నాయి. ఆయన ఆ పదవికి రాజీనామా చేశాక 20015లో జరిగిన ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ పోటీ చేశారు. మురళీ మోహన్ మద్దతుతో జయసుధ ప్యానల్ బరిలో నిలిచింది.


నాడు హోరాహోరీగా జరిగిన మా పోరులో రాజేంద్రప్రసాద్ గెలిచారు. ఆయనకు మెగా ఫ్యామిలీ మద్దతు ఇస్తే నందమూరి బాలక్రిష్ణ, మోహన్ బాబు,  క్రిష్ణ కుటుంబం అంతా జయసుధకు మద్దతుగా నిలిచారు. ఇపుడు మళ్ళీ అదే సీన్ కనిపిస్తోంది. ఈసారి కూడా వైరి  వర్గాలు జూలు విదిలిస్తున్నాయి. మరి విజయం ఎవరిదో చూడాలి. అయితే టాలీవుడ్లో మాత్రం చీలిక మరో మారు ఈ విధంగా బయట పడే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: