ఈ మద్య టాలీవుడ్ లో వరుసగా ఎన్టీఆర్ బయోపిక్ లు వస్తున్నాయి.  క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.  మొదటి నుంచి ఈ సినిమాలపై భారీ అంచనాలు పెంచుకుంటూ వచ్చారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విశ్వ నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ జీవిత కథ అంటా అభిమానులు ఎంతో సంతోషించారు.  కానీ తీరా థియేటర్లో కి వెళ్లిన తర్వాత ఈ రెండు సినిమాలు చూసి బాగా నిరుత్సాహం పొందారు. 
Related image
ఎన్టీఆర్ కథానాయకుడు కేవలం వేషాలకు మాత్రమే అని..ఎన్టీఆర్ మహానాయకుడు చంద్రబాబు కోసమే అని టోటల్ గా ఎన్టీఆర్ బయోపిక్ పై బాగా అసతృప్తి పొందారు. ఇదే సమయంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమా నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ చివరి దశలో ఎదుర్కొన్న కష్టాలు...కన్నీళ్లు మన కళ్లకు కట్టినట్లు చూపిస్తానని అంటున్నారు.  1989 తర్వాత ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందూ చూపిస్తానని అంటున్నారు. 
Image result for laxmis ntr
మార్చి 22న విడుద‌ల కానున్న ఈ సినిమా సంబంధించిన షూటింగ్ ఓ వైపు జ‌రుగుతుంటే మ‌రో వైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు, ప్ర‌మోష‌న్స్ చాలా స్పీడ్‌గా సాగుతున్నాయి. తాజాగా సినిమా నుండి అవ‌స‌రం అంటూ సాగే పాట వీడియో విడుద‌ల చేశారు. క‌ళ్యాణ్ మాలిక్ సంగీతంలో రూపొందిన ఈ పాట‌కి సిరా శ్రీ లిరిక్స్ రాశారు. విల్స‌న్ హ‌రెల్డ్ ఆల‌పించారు. ఈ సింగ‌ర్ వాయిస్ కాస్త ఘంట‌సాల వాయిస్‌లా అనిపిస్తుండ‌డంతో వ‌ర్మ దీనిపై క్లారిటీ ఇచ్చారు. పాట‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ..ఈ పాట‌ని ఘంట‌సాల ఆల‌పించ‌లేదు అని ఫ‌న్నీగా కామెంట్ పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: