టాలీవుడ్ లో క్లాసికల్, మాస్,మెలోడీ ఎలాంటి సంగీతమైనా తన స్టైల్లో అందించి అందరి మనసు గెల్చుకున్నారు ఎం ఎం కీరవాణి.  ప్రేమికులు మధుల గీతాలు..భక్తిరస గీతాలు ఏవైనా ఈయన అందించిన సంగీతం ఇప్పటికీ..ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటాయి. బాహుబలి, బాహుబలి 2 సినిమాలకు కీరవాణి అందించిన సంగీతం ఎంతో హైలెట్ అయ్యిందనే చెప్పొచ్చు.  ఇక రాజమౌళి బంధువు అయిన కీరవాణి ఆయన సినిమాల్లో ఎక్కువ సంగీతం అందించారు. 
Image result for rrr movie
ప్రస్తుతం రాజమౌళి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో  ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత డివివి దాన‌య్య నిర్మిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటిలో జరుగుతుంది.  ఈ షూటింగ్ పూర్తయిన తర్వాత తర్వాత షెడ్యూలో కోల్ కోతాలో జరుపుకుంటున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్- అల్యూమినియం ఫ్యాక్టరీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి’ దీనికి సంబంధించిన ట్విట్ ఎం ఎం కీరవాణి  చేశారు. 

దాంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. మా ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్‌కు బీజీయమ్ అదిరిపోవాలి సార్ అని తారక్ అభిమానులు అంటుంటే.., రామ్ చరణ్ ఎంట్రీ సీన్‌కు బాక్సులు బద్దలైపోవాలి అంటూ మెగాభిమానులు రిప్లైలు ఇస్తూ.. వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: