ప్రముఖ నటుడు  బాలక్రిష్ణ టాలీవుడ్లో లెజెండరీ పర్సనాలిటీ. ఆయన వందకు పైగా సినిమాల్లో నటించారు. ఇంకా నటిస్తున్నారు. ఆయంకు ఎంతో ఫ్యాన్ మెయిల్ ఉంది. అలాగే ఆయన అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. బసవరామ తారకం ఆసుపత్రి చైర్మన్ గానూ ఉన్నారు.


అటువంటి బాలయ్యకు ఓ మూవీని అంకితం చేస్తున్నారు. అదేంటి అంటే ఆయన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కధ ఆధారంగా నిర్మించిన లక్ష్మిస్ ఎన్టీఆర్ మూవీని బాలయ్యకు అంకితం చేయబోతున్నారుట.


ఆ సంగతిని చిత్ర దర్శకుడు రాం గోపాల్ వర్మ స్వయంగా ప్రకటించడం విశేషం. నిన్న జరిగినా లక్ష్మిస్ ఎన్టీఆర్  సాంగ్స్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ మూవీకి స్పూర్తి  బాలక్రిష్ణ అని చెప్పుకొచ్చారు. బాలయ్యతో కలవకుంటే ఈ మూవీ తీసే ఆలోచన తనకు రాదు అని కూడా చెప్పారు. 


అన్న గారి జీవితంలో చివరి రోజుల్లో జరిగిన ఘట్టాలే తనను మూవీకి తీసేలా చేశాయని చెబుతున్న వర్మ ఈ మూవీ విడుదల చేయకుండా ఏ శక్తి అడ్డుకోదని కూడా చెబుతున్నారు. మరి బాలయ్య తనకు అంకితం ఇస్తున్న ఈ మూవీ మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: