మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎలక్షన్స్ దాదాపుగా సాధారణ ఎలక్షన్స్ జరిగినంత హంగామా చేశారు. 800 మంది సభ్యులున్న మా లో ఐక్యత లేదా అన్న టాక్ కూడా వచ్చింది. ఈ ఎలక్షన్స్ లో శివాజి రాజా, నరేష్ ఇద్దరు పోటీపడ్డారు. అసలు ఒకప్పుడు ఏకగ్రీవంగా ఎవరో ఒకరిని ఎన్నుకునే మా అధ్యక్ష పదవికి ఈసారి టఫ్ ఫైట్ ఏర్పడింది.


అయితే ఆల్రెడీ శివాజి రాజా రెండేళ్లు మా అధ్యక్షుడిగా ఉన్నాడు. కొన్ని మంచి పనులు చేశాడు. కాని ఈసారి నరేష్ కు ఛాన్స్ ఇచ్చారు. గెలిచిన ఆనందంలో నరేష్ చాలా హామీలే ఇచ్చాడు. మేనిఫెస్టోలో ఉన్న అన్ని ఈ టర్మ్ లో కచ్చితంగా పూర్తి చేసి తీరుతా అని చెప్పారు. మా నూతన అధ్యక్షుడిగా నరేష్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.


ముఖ్యంగా యువ నటుల కోసం ఓ సెపరేట్ వింగ్ తయారు చేయించడం శివాజి రాజాకు దాని బాధ్యతలను అప్పగించడం వంటివి చేస్తానని చెప్పారు. జీవిత రాజశేఖర్, రాజశేఖర్, నరేష్ ముగ్గురం కలిసి ఓ మంచి లీడర్ షిప్ ఇస్తామని అన్నారు. అయితే కేవలం నరేష్ ప్యానెల్ మాత్రమే కాదు ఉపాధ్యక్షురాలిగా హేమ ఇండిపెండెంట్ గా గెలిచింది.    


ఎస్వి కృష్ణా రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా గెలిచాడు. సో కేవలం అధ్యక్షుడిగా నరేష్ చెప్పినవన్ని చేయాలంటే మిగతా ప్యానెల్ సభ్యులంతా దానికి ఓకే చెప్పాలి. దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల తనకు అన్ని ఉన్నాయని ఇక మా కి సేవ చేయడమే ముఖ్య ఉద్దేశం అన్నట్టుగా మాట్లాడాడు నరేష్. మరి ఆయన చెప్పినవన్ని చేస్తాడా లేదా అన్నది చూడాలి.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: