బాలీవుడ్ లో ఎన్నో అద్భుత చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు కరణ్ జోహార్.  ఫిలింమేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ క‌ల‌ల ప్రాజెక్ట్ క‌ళంక్ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ జోరందుకుంటున్నాయి.  ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఒక్కో స్టార్ కి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ వచ్చారు.  తాజాగా ఈ సినిమా కు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. అంద‌మైన క‌ళాకృతితో పాటు క‌ట్ట‌డాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంటు న్నాయి. భారీ పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి అభిషేక్ వ‌ర్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 


ఒక రకంగా చెప్పాంటే మరో బాహుబలి కళ్లముందు కనిపిస్తున్నట్లు ఉంది. మరో ప్రత్యేకత ఏంటంటే..ఈ సినిమా కరణ్‌ జోహార్‌ తండ్రి యశ్‌ జోహార్‌ కలల ప్రాజెక్టు కావ‌డంతో ప్రత్యేక శ్రద్ధ తీసు‌కుం‌టు‌న్నాడు.‌  ఈ మూవీ  కరణ్ జోహర్‌, సాజిద్ నదియావాలా, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఈ సినిమా కోసం ఓల్డ్‌ ఢిల్లీ సిటీ సెట్టింగ్‌ నిర్మా‌ణా‌నికి ఏకంగా పది‌హేను కోట్లు ఖర్చు చేసాడ‌ట‌.


1940 కాలానికి చెందిన ప్రేమ‌క‌థ‌గా ఈ సినిమా రూపొందుతుంది. స్వాతంత్య్రం రాక‌ముందు ఓ యువ‌రాణికి, సామాన్య వ్య‌క్తికి మ‌ధ్య పుట్టిన ప్రేమ క‌థ ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ మద్య వస్తున్న పిరియాడికల్ సినిమాలకు మంచి ప్రాధాన్యత వస్తుంది. ఈ మూవీలో సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్, ఆలియా భట్, వరుణ్‌ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్‌ కపూర్‌ ముఖ్య పాత్రలు పోషి‌స్తు‌న్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: