మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ‘కొదమ సింహం’బ్లాక్ బస్టర్ మూవీ.  ఈ సినిమా కౌబాయ్ నేపథ్యంలో ఉంటుంది.  అప్పట్లో ఈ సినిమా ఓ ట్రెండ్ సృష్టించింది.  తాజాగా ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'కొదమ సింహం' సినిమా కోసం కథా కథనాలపై కసరత్తు జరుగుతోన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి నాకు ఫోన్ చేసి షాక్ ఇచ్చారు.  ఆ సమయంలో ఆయన నుంచి నాకు ఫోన్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు.  వాస్తవానికి కొదమసింహం కథ వేరే వాళ్లు రాశారు..సంభాషలపై సత్యానంద్ మెరుగులు దిద్దుతున్నారు. 
Related image
అయితే ఈ సినిమా కథ విన్నపుడే మెగాస్టార్ చిరంజీవి కి చిన్న అనుమానాలు వచ్చాయట.  ఈ సినిమా కౌబాయ్ నేపథ్యంలో బాగానే ఉన్నా ఎక్కడో చిన్న లోపాలు కనిపిస్తున్నాయని..కథ మీరు ఒక్కసారి వింటే..బాగుందని చెబితే కంటిన్యూ చేద్దాం..లేదంటే ఏవైనా మార్పులు ఉంటే కూడా మీరు చూసుకోండని చిరంజీవి నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారు.  ఆయన చెప్పినట్టే నేను కథ విన్నాను..అయితే ఈ సినిమాలో సుడిగాలి పాత్రలో విలక్షణ నటుడు మోహన్ బాబు నటించారు..ఈయన పాత్ర ఇంట్రవెల్ తోనే ముగిసిపోతుందని.. సత్యానంద్ నాకు చెప్పారు. 
Image result for kodama simham sudigali
ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించినా..ఎంతో కామెడీ పండించారు..అలాంటిది ఆయన పాత్ర ఇంట్రవెల్ లోనే ముగిసి పోతే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ అనేది పోతుంది .. అందువలన ఆ పాత్ర చనిపోకూడదు' అని చెప్పాను. అయితే ఈ సినిమాలో సుడిగాలి పాత్రలో మోహన్ బాబు బ్రతికి ఉంటే ఎలా ఉటుంది అనేది అక్కడి నుంచి స్క్రీన్ ప్లే వేశాము. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది" అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: