టాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చేస్తారని అభిమానులు కల్లో కూడా అనుకోలేదు. కాని అనూహ్యంగా బాహుబలి తర్వాత ఆ సినిమాను మించి మరో సినిమా చేయాలన్న ఆలోచనతో రాజమౌళి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేశాడు. చిరంజీవి, బాలకృష్ణ కూడా కలిసి చేద్దామని అనుకోగా అది కుదరలేదు కాని ఈ మెగా నందమూరి మల్టీస్టారర్ చరిత్ర సృష్టించబోతుందని చెప్పొచ్చు.


కలిసి సినిమా చేస్తున్నా ఎవరి పోర్షన్ వారిదే కాబట్టి ఎన్.టి.ఆర్ నటనకు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో రాం చరణ్.. రాం చరణ్ కు గట్టి పోటీ ఇవ్వాలన్న కారణంతో ఎన్.టి.ఆర్ ఇద్దరు ఎవరికి వారు గట్టి వర్క్ అవుట్స్ చేస్తున్నారట. ఎలాగు జక్కన్న తనకు కావాల్సిన అవుట్ పుట్ వారి నుండి తీసుకుంటాడు.


అయితే ఇద్దరు కత్తుల్లాంటి స్టార్స్ ను ఒకేచోట చేర్చాడు కాబట్టి పూర్తి బాధ్యత ఆయనే తీసుకోవాలి. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా మూడవ షెడ్యూల్ కలకత్తాలో ప్లాన్ చేసుకున్నారు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇప్పటివరకు నటించిన సినిమాలు ఒక లెక్క అయితే ఈ సినిమా ఒక లెక్క అంటున్నారు.


మీరో అద్భుతం చూడబోతున్నారు.. ఆర్.ఆర్.ఆర్ బాహుబలికి ఏమాత్రం తగ్గని సినిమా అంటూ సినిమా మీద అంచనాలను డబుల్ ట్రిపుల్ అయ్యేలా చేస్తున్నాడు రాజమౌళి. ఎలా చూసినా ఆర్.ఆర్.ఆర్ తో మరోసారి తెలుగు సినిమా సత్తాని చాటేలా కనిపిస్తున్నాడు మన జక్కన్న. డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: