ఒకప్పుడు టాలీవుడ్ లో మినిమం ఇరవై కోట్లు అంటే భారీ బడ్జెట్ అనేవారు..కానీ రాజమౌళి లాంటి దర్శకులు వచ్చాక.. మినిమం వంద కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీయడం మొదలు పెట్టారు.  ఆ స్థాయిలో ప్రమోషన్ వర్క్..సినిమా హిట్ అయితే కలెక్షన్లు కూడా రాబడుతున్నాయి.  ఇటీవల శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 మూవీకి ఏకంగా రూ.450 కోట్ల బడ్జెట్ వెచ్చించారు. రాజమౌళి తీసిన బాహుబలి 2 సినిమాకు దేశ వ్యాప్తంగా రూ.1600 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.  ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 
Image result for ss rajamouli
ఈ సిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి.  అయితే ఈ సినిమాపై కొంత కాలంగా రక రకాల కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో..రాంచరణ్ పోలీస్ అయితే..ఎన్టీఆర్ బందిపోటు పాత్రలో కనిపించబోతున్నారని..ఇలా రక రకాలుగా రూమర్లు పుట్టుకొచ్చాయి.  ఈ నేపథ్యంలో 'RRR' చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టారు.  ఈ సందర్భంగా రాజమౌళి ఎన్నో విషయాలు చర్చించారు. 1900సంవత్సరంలో జరిగే సంఘటనలతో ఈ సినిమా రూపొందనుందని వెల్లడించారు.
Image result for rrr press meet
అల్లూరి సీతారామారాజు, కొమరం భీం ల పాత్రలను తీసుకొని  ఫిక్షన్ జోడించి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.  భారీ బడ్జెట్ తో సుమారు రూ.350 నుండి 400 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు నిర్మాత దానయ్య తెలిపారు. 2020 జూలై 30 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత అనౌన్స్ చేశారు. ఈ సినిమా దాదాపు పది భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: