టాలీవుడ్ లొ మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ‘విష్ణు’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత విష్ణుకి చెప్పుకోదగ్గ సినిమా అంటే ఢీ ఒక్కటీ.  ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా యావరేజ్ టాక్ వచ్చినవే.  చాలా కాలం గ్యాప్ తీసుకున్న విష్ణు తాజాగా జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో ‘ఓటర్’ సినిమాలో నటిస్తున్నాడు.  రామా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ నడుస్తుంది. 
Image result for voter movie manchu vishnu
ఇటీవల తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన ‘సర్కార్’ఈ నేపథ్యంలో వచ్చింది.  యంగ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ‘నోటా’సినిమా కూడా రాజకీయ నేపథ్యంలో వచ్చిందే.  ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో ‘ఓటర్’సినిమాకు ఎంతో ప్రాధాన్యత వస్తుంది.  మన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను నేడు చిత్రబృందం విడుదల చేసింది. 
Image result for voter movie manchu vishnu
‘అహింస మార్గం ద్వారా ఒక్క బుల్లెట్‌ కూడా కాల్చకుండా స్వాతంత్ర్యం తెచ్చుకున్న దేశం మనది. మనం పేదరికంపై పోరాటం చేశాం కానీ, పేదలపై పోరాటం చేయలేదు. మార్పు మనలో రావాలి’అంటూ  మంచు విష్ణు పవర్ ఫుల్  డైలాగ్ ఆకట్టుకుంటోంది. ‘నేను ఆఫ్ట్రాల్ ఓటర్‌ని కాదు.. ఓనర్‌’ అని విష్ణు చెప్పే చూస్తుంటే ఓటరు విలువ ఏంటో ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో  ఓ కీలక పాత్రలో సంపత్ రాజ్ నటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: