ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున హీరోగా పరిచయం అయి తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు.  టాలీవుడ్ లో మన్మధుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున ప్రస్తుతం నిర్మాతగా, నటుడిగా కొనసాగుతున్నారు.  ఆయన తనయులు ఇద్దరు నాగ చైతన్య, అఖిల్ హీరోలుగా రాణిస్తున్నారు.  కింగ్ తర్వాత నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' సూపర్ హిట్ అయ్యింది.  ఆయన సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు. 
Image result for soggade chinni nayana
ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో నాగార్జున నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో బంగార్రాజు పాత్రలో నాగ్ చేసిన రొమాంటిక్ అంతా ఇంతా కాదు.   నాగార్జున కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో 'బంగార్రాజు'గా ఆయన పోషించిన పాత్ర బాగా పాప్యులర్ అయింది. ఈ సినిమాకి, అప్పటి నుంచి సీక్వెల్ చేయాలనే ఉద్దేశంతోనే నాగార్జున వున్నారు..మొత్తాని ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే దిశగా కొనసాగుతుంది.
Image result for soggade chinni nayana
కల్యాణ్ కృష్ణ ఈ సినిమా స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దుతున్నాడు. జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో బంగార్రాజు పాత్రకి భార్యగా రమ్యకృష్ణనే ఎంపిక చేస్తున్నారు.  ట్విస్ట్ ఏంటంటే..నాగ్ కి మనవడిగా చైతూ కనిపించనున్నాడని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాలో, చైతూ సరసన నాయికగా ఎవరు కనిపించనున్నారనేది తెలియాల్సి వుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: