టాలీవుడ్ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి గురువారం రాజమౌళి పెట్టిన ప్రెస్ మీట్ దగ్గరనుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కొమరం భీం గా ఎన్.టి.ఆర్, సీతారామరాజుగా చరణ్ ఇద్దరి రియల్ లైఫ్ పాత్రల్లో నటించనున్నారు. ఈ ఎనౌన్స్ మెంట్ తో మెగా నందమూరి ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడుచుకున్నాయని చెప్పొచ్చు.


ఇక ఈ సినిమా కోసం బ్రిటీష్ భాగ డైసీ ఎడ్గర్ జోన్స్ తో పాటుగా బాలీవుడ్ నుండి అలియా భట్ ను తెస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. అయితే ఇంతకీ ఆర్.ఆర్.ఆర్ లో విలన్ ఎవరు అన్నది ప్రశ్నకు సమాధానం దొరకలేదు.


సీతారామరాజు తెల్లోళ్ల మీద ఫైట్ చేశాడు.. కొమరం భీం నిజాం పరిపాలన మీద వ్యతిరేకత చూపాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమా వారు ఫ్రీడం ఫైటర్స్ గా మారక ముందు చెప్పబోతున్న కథ ఎవరికి తెలియని కథ అంటున్నారు. అయితే ఇందులో విలన్ ఎవరు అన్నది క్లారిటీ లేదు. కేవలం తెల్లవాళ్లనే విలన్స్ గా చూపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.


విలన్ పాత్రలో ఎవరిని తీసుకుంటున్నారు అతని పాత్ర పేరేంటి అతని పాత్ర కేవలం సినిమా సృష్టేనా ఇలాంటి ప్రశ్నలన్ని ఉన్నాయి. ఆల్రెడీ ఆ ఇద్దరు రియల్ హీరోస్ కథనే తీసుకుని కల్పిత కథతో ఆర్.ఆర్.ఆర్ చేస్తున్నామని రాజమౌళి క్లియర్ కట్ గా చెప్పాడు. సో వారు ఫ్రీడం ఫైటర్స్ గా మారేందుకు జరిగిన పరిణామాలు సినిమాలో ఉంటాయన్నమాట. మొత్తానికి బాహుబలి తర్వాత రాజమౌళి ఆ సినిమాను మించే కథతో.. కాస్టింగ్ తో వచ్చాడని మాత్రం చెప్పొచ్చు.
  


మరింత సమాచారం తెలుసుకోండి: