సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్ధన్నర కాలంగా సినిమాలు చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్న త్రిష మధ్యలో కొద్దిరోజులు కాస్త కెరియర్ లో వెనుకపడ్డట్టు అనిపించినా మళ్లీ కొత్త ప్రయత్నాలతో ట్రాక్ లోకి వచ్చింది. ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలు చేస్తూ అలరిస్తున్న త్రిషా పెళ్లి ఎప్పుడంటే మాత్రం మాట దాటవేస్తుంది.


చెన్నై బిజినెస్ మెన్ తో నిశ్చితార్ధం దాకా వెళ్లి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న త్రిష మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. కోలీవుడ్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన 96 సినిమా సూపర్ హిట్ అందుకోగా ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటుంది. రీసెంట్ గా పెళ్లిపై నోరు విప్పిన త్రిష నచ్చినవాడు దొరకాలిగా అనేస్తుంది.


తన మనసుకి దగ్గరగా అనిపించిన అతన్ని ప్రేమించి పెళ్లాడుతా అంటుంది త్రిష. అలాంటి వ్యక్తి కనిపించి తనని నేను.. నేను తనని ఇద్దరం ఇష్టపడితే కచ్చితంగా ఈరోజు, రేపో పెళ్లాడేస్తా అంటుంది. అయితే ఎంత హడావిడిగా చేసుకున్నా అందరికి చెప్పే చేసుకుంటానని అంటుంది ఈ చెన్నై సుందరి. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో కలిసి నటించిన త్రిష ఇప్పుడు కోలీవుడ్ లో సత్తా చాటుతుంది.


ఇన్నేళ్లు కెరియర్ కొనసాగించడం ఒక ఎత్తైతే ఇప్పటికి ఫాం కొనసాగించడం మరో ఎత్తు. తెలుగులో అవకాశాలు లేని త్రిష కోలీవుడ్ లో వరుస ఛాన్సులు కొట్టేస్తుంది. నయనతార చూపించిన మార్గంలో కొత్త కథలతో లేడీ ఓరియెంటెడ్ కథలు చేస్తూ వస్తుంది త్రిష. మరి త్రిష మనసు గెలిచే ఆ అదృష్టవంతుడు ఎవరో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: