టాలీవుడ్ హీరోలు ఇప్పుడు అన్ని విషయాల్లో బాలీవుడ్ హీరోలకు పోటీ పడుతున్నారు. ఫాలోయింగ్.. క్రేజ్.. దృష్ట్యా కొద్దిగా మార్పులున్నా మన వాళ్ల మెయింటెనెన్స్ బాలీవుడ్  స్టార్స్ కు సమానంగా ఉంది. ఇక తెలుగు హీరోలు ముఖ్యంగా కార్ల విషయంలో తమ టేస్ట్ ను చూపిస్తున్నారు. 


ఒక్కో హీరో ఒక్కో కారుని ప్రిఫర్ చేస్తాడు. అయితే మార్కెట్ లో కొత్త కారు వచ్చింది అంటే అది తమ దగ్గర ఉండాల్సిందే అనుకునే హీరోలు ఉన్నారు. టాలీవుడ్ లో నాగార్జున, ప్రభాస్, చిరంజీవి, ఎన్.టి.ఆర్ కార్లంటే మహా ఇష్టం ఉన్న హీరోలున్నారు. వారి టేస్ట్ కు తగినట్టుగా ఉన్న కారుని ఎంత ఖర్చు పెట్టి అయినా తీసుకుంటున్నారు.


ప్రస్తుతం మన హీరోలు ఒక్కో సినిమాకు 20 కోట్లు దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మీడియం రేంజ్ హీరోలకు 10 కోట్లు ఇస్తున్నారు. అందుకే వారు వాడే కార్ల విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. టాలీవుడ్ లో ఎక్కువ రేటు కలిగిన కారు వాడేది ప్రభాస్.. రోల్స్ రాయస్ ఫాంటం కారుని వాడుతున్నాడు ప్రభాస్. దీని ధర 8 కోట్ల దాకా ఉంటుందట. చిరంజీవి దగ్గర రోల్స్ రాయస్ ఫాంటం కారు ఉందట అయితే దాని కన్నా ప్రభాస్ కారు హై ఎండ్ మోడల్ అని తెలుస్తుంది.


రాం చరణ్ వి8 వింటేజ్ కారు వాడుతున్నాడట. అయితే అది కాకుండా మూడున్నర కోట్లతో రేంజరోవర్ కూడా కొన్నాడట. అక్కినేని అఖిల్ దగ్గర బెంజ్ జి63 కారు ఉంది. దీని ధర రెండున్నర కోట్ల దాకా ఉంటుందట. మహేష్ 2 కోట్ల రేంజ్ రోవర్ వాడుతున్నాడు. నాగార్జున బి.ఎం.డబల్యు ఎం6 కారు వాడుతున్నాడు. దీని ధర కోటిన్నర దాకా ఉండొచ్చని తెలుస్తుంది. బాలకృష్ణ కూడా బి.ఎం.డబల్యు 7 కారు వాడుతున్నాడు. ఇక వీరితో పాటుగా ఎన్.టి.ఆర్ పోర్షే కారు వాడుతుండగా.. రవితేజ మెర్సెడెస్ క్లాస్ కారు తీసుకున్నాడు. అల్లు అర్జున్ మాత్రం జాగ్వార్ కారు తీసుకున్నాడు. బన్ని కారు కూడా రెండు కోట్ల దాకా ఉంటుందట.



మరింత సమాచారం తెలుసుకోండి: