భరత్ కమ్మ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా కాకినాడ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మికల జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. ఆల్రెడీ ఈ ఇద్దరు గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.


ఇక ఇప్పుడు డియర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. నిమిషం టీజర్ లో ఓ పక్క తనలోని మాస్ యాంగిల్ ను చూపిస్తూ తన ఫ్యాన్స్ కోసం రష్మికతో ముద్దు ముచ్చట్లు తీర్చుకున్నాడు విజయ్ దేవరకొండ. చూస్తుంటే మరోసారి ఈ ఇద్దరు రెచ్చిపోయారని తెలుస్తుంది.


డియర్ కామ్రేడ్ కచ్చితంగా యూత్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మనసు గెలుస్తుందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. మే నెలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తున్నాడు. విజయ్, రష్మిక రొమాన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో మరో సూపర్ హిట్ మీద కన్నేశాడు.


గీతా గోవిందం తర్వాత విజయ్, రష్మికల క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. వారి జోడీనే ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యేలా చేస్తున్నారు. టీజర్ లోనే లిప్ లాక్ ఉందంటే సినిమాలో విజయ్, రష్మిక ఇంకెలా రెచ్చిపోయారో.. టీజర్ తో మొదలైన ఈ డియర్ కామ్రేడ్ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: