సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ అసలు కథగా వస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. ఈ సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఓ పక్క మార్చి 22న సినిమా రిలీజ్ అని ఎనౌన్స్ చేయగా సినిమా రిలీజ్ ను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్నారు టిడిపి శ్రేణులు.     


ఎలక్షన్ కమీషన్ కు ఫిర్యాదు చేసే సినిమా రిలీజ్ తర్వాత ఏదైనా చేస్తాం కాని రిలీజ్ ముందు ఏం చేయలేమని అన్నారు. ఇక ఇప్పుడు సెన్సార్ సభ్యులు ఆర్జివికి షాక్ ఇచ్చారు. ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు సెన్సార్ వాయిదా వేస్తున్నట్టు చెప్పారట. దీనిపై వర్మ తీవర్స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


సినిమా సర్టిఫికెట్ మాత్రమే ఇచ్చే సెన్సార్ సభ్యులకు సినిమా రిలీజ్ వాయిదా వేసే అధికారం లేదని. చట్ట విరుద్ధంగా తన సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అయితే ఈ విషయంపై సెన్సార్ బోర్డ్ మీద తాను కేసు పెడుతున్నట్టుగా తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు ఆర్జివి. ఇవాళ రేపట్లో కడపలో ఆడియో రిలీజ్ కూడా పెట్టుకోగా రిలీజ్ టెన్షన్ లో అది జరపాలా వద్దా అని ఆలోచిస్తున్నారట.  


ఆర్జివి ఏం చేసినా అదో పెద్ద సంచలనం.. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ విషయంలో సెన్సార్ తీరుని తప్పుబట్టారు ఆర్జివి. చట్ట విరుద్ధంగా వెళ్తున్న సెన్సార్ టీం పై తాను కేసు పెడుతున్నానని వెళ్లడించారు. మరి రాజివి సెన్సార్ బోర్డ్ మీద గెలుస్తాడా.. సినిమా అనుకున్న టైంకు వస్తుందా అన్నది హాట్ న్యూస్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: